Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌లో 5 కొత్త ఆటలు...కాదు కాదు... 4 కొత్త గేమ్స్... అవేంటి?
ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా మహోత్సవం అంటే అది ఒలింపిక్సే. టోక్యో ఒలింపిక్స్ 2020లో కొత్తగా నాలుగు ఆటలను ప్రవేశపెట్టారు. మరో క్రీడ సాఫ్ట్/బేస్ బాల్ గతంలోనేే ప్రవేశపెట్టారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదీంతో పతకాలు ప్రదానం చేసే ఈవెంట్ల సంఖ్య 339కి చేరింది. ఇంతకీ ఆ 5 క్రీడలు ఏంటంటే... సర్ఫింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, కరాటే, స్కేట్ బోర్డింగ్, బేస్ బాల్/సాఫ్ట్ బాల్.
Surfing: పురుషులు, మహిళల విభాగాలలో పోటీలు ప్రీలిమినరీ హీట్స్, హెడ్ టు హెడ్ నాకౌట్ రౌండ్లలో నిర్వహిస్తారు. సర్ఫర్ల నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకొని విజేతను ఎంపిక చేస్తారు.
Sport Climbing: స్పీడ్, బౌల్డరింగ్, లీడ్ అనే మూడు విభాగాల సమాహారంగా ఈ పోటీ జరుగుతుంది. మూడు విభాగాలలో ఆధిక్యం కనబరిచిన వారిని పురుషులు, మహిళల్లో విజేతలుగా ప్రకటిస్తారు.
Skateboarding: పార్క్, స్ట్రీట్ అనే రెండు విభాగాల్లో పతకాలు ప్రదానం చేస్తారు. పార్క్ విభాగంలో..డోమ్‌లా ఉండే స్టేడియంలో స్కేటర్లు తమ నైపుణ్యాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. స్ట్రీట్ కేటగిరిలో..మెట్లు, రెయిలింగ్ మీద నుంచి స్కేట్బోర్డింగ్ చేయాల్సి ఉంటుంది. స్కేటర్ల నైపుణ్యాల ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు.
Karate: కటా, కుమిటే విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తారు. పురుషులు, మహిళల్లో మూడు వెయిట్ కేటగిరీల్లో పోటీలుంటాయి. 2024 ఒలింపిక్స్‌లో కరాటేను కొనసాగించడం లేదు. ఈ ఒక్క ఒలింపిక్స్‌కే ఇది పరిమితం.
Baseball/Softball: ఇక..గత ఒలింపిక్స్‌లో పతక క్రీడగా ఉండి తర్వాత ఉపసంహరించిన బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్ టోక్యో గేమ్స్‌లో పునరాగమనం చేస్తున్నాయి. అయితే ఈ ఒక్క క్రీడలకే ఇవి పరిమితం.