Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో 8 జంటలు... వారెవరు? ఏ దేశం?
Tokyo Olympics - 2021లో కొందరు క్రీడాకారులు తమ భాగస్వామితో కలిసి పాల్గొంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కొందరు ఒకే ఈవెంట్లో పాల్గొంటే... మరి కొందరు తమ తమ కేటగిరీల్లో విడివిడిగా పోటీ చేస్తున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMegan Jones and Celia Quansah: బ్రిటన్ రగ్బీ ఉమెన్స్ జట్టులో వీళ్లిద్దరూ సభ్యులు. వీళ్లిద్దరూ ఎప్పటి నుంచో డేటింగ్‌లో ఉన్నారు. లాక్ డౌన్ సమయంలో వీరిద్దరూ కలిసి ప్రాక్టీస్ చేసేవాళ్లు.
Atanu Das and Deepika Kumari: భారత్‌కు చెందిన వీరిద్దరూ 2020లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ ఆర్చరీ ఆటగాళ్లే.
Edward Gal and Hans Peter: డచ్ జంటైన వీరు హాలాండ్ తరఫున ఈ ఒలింపిక్స్‌లో పాల్గన్నారు. Equestrian Dressage లో వీరు పాల్గొన్నారు.
Laura and Jason Kenny: ఇంగ్లాండ్‌కు చెందిన వీరిద్దరికీ 2016లో పెళ్లయ్యింది. వీరిద్దరూ ఇంగ్లాండ్ సైక్లింగ్ జట్టులో సభ్యులు. తమ తమ విభాగాల్లో ఇప్పటికే వీరిద్దరూ 10 ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ సాధించారు.
Sandi Morris and Tyrone Smith: సాండీ మోరిస్ పోల్ వాల్టర్. టైరోన్ స్మిత్ లాంగ్ జంపర్. వీరిద్దరూ 2019లో వివాహం చేసుకున్నారు.
Sue Bird and Megan Rapinoe: అమెరికా మహిళల ఫుట్‌బాల్ జట్టులో సభ్యురాలు మేఘన్. సు బర్డ్ బాస్కెట్ బాల్ ప్లేయర్. వీరిద్దరూ గత ఏడాది అక్టోబరులో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు.
Hunter Woodhall and Tara Davis: ఈ దంపతులు జపాన్ నుంచి ప్రాతినిథ్యం వహించారు. మహిళల లాంగ్ జంప్ విభాగం నుంచి తారా ఒలింపిక్స్‌లో, పారా ఒలింపిక్స్‌లో ఉడ్‌హాల్ పాల్గొన్నారు.
Charlotte Caslick and Lewis Holland: ఆస్ట్రేలియాకు చెందిన వీళ్లిద్దరూ రగ్బీ ఆటగాళ్లు. వీళ్లిద్దరూ గత ఏడాది పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కానీ, కరోనా కారణంగా పెళ్లిని వాయిదా వేసుకున్నారు.