IAS Aishwarya Sheoran Profile: IAS కోసం మోడలింగ్ కెరీర్‌నే పక్కనబెట్టింది... తొలి ప్రయత్నంలోనే 93వ ర్యాంక్
UPSC పరీక్షల కోసం తన మోడలింగ్ కెరీర్‌నే వదులుకుంది ఐశ్వర్య షియోరన్. ఎలాంటి కోచింగ్ లేకుండా 10 నెలలు ఇంట్లోనే ఉండి UPSC పరీక్షలు రాసింది.
Beauty With Brain అనే పదం ఐశ్వర్య షియోరన్‌కి సరిగ్గా సరిపోతుంది. తొలి ప్రయత్నంలోనే ఐశ్వర్య UPSC పరీక్షల్లో 93 ర్యాంకు సాధించి IAS ఆఫీసర్ అయ్యింది.
ఐశ్వర్య షియోరన్ 2016 లో మిస్ ఇండియా ఫైనలిస్ట్. 2015 లో ఆమె మిస్ ఢిల్లీ కిరీటం గెలుచుకుంది. 2014 లో మిస్ క్లీన్ అండ్ కేర్ ఫ్రెష్ ఫేస్‌గా ఎంపికైంది.
ఐశ్వర్య షియోరన్ కుటుంబం ఢిల్లీలో నివసిస్తుంది. ఆమె చాణక్యపురిలోని సంస్కృత పాఠశాల నుంచి పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఐశ్వర్య 12 వ తరగతిలో 97.5% మార్కులు సాధించింది.
సివిల్స్ పరీక్షలకు హాజరు కావడం తన కల అని చెబుతోంది ఐశ్యర్య. ఆమె తండ్రి ఆర్మీలో కల్నల్ గా పనిచేస్తున్నారు. ఆమె రాజస్థాన్ లో పుట్టింది.
2018 లో ఐశ్వర్య షియోరన్ ఐఐఎం ఇండోర్‌కి కూడా ఎంపికైంది కానీ IAS కోసం అది వదులుకుంది.
ఐఏఎస్ టార్గెట్ ను రీచ్ అవ్వాలనే ఉద్దేశంతోనే, అటు మోడలింగ్ ని, ఇటు ఫ్యాకల్టీ పదవిని కూడా పక్కకు తోసేసి కేవలం పది నెలల సమయంతోనే, ఐఏఎస్ అధికారిగా తన కలను సాకారం చేసుకుంది.