Asian Champions Trophy 2024: చైనాపై సంచలన విజయం, ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ విజేతగా భారత్

భారత అమ్మాయిల హాకీ జట్టు సంచలన విజయం నమోదు చేసింది. తద్వారా ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024 విజేతగా అవతరించింది. పారిస్ ఒలింపిక్స్ లో రజతం సాధించిన జట్టును ఓడించి టైటిల్ నెగ్గితే ఆ కిక్కే వేరప్పా.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
బిహార్ లోని రాజ్‌గిర్‌లో బుధవారం జరిగిన ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత మహిళల జట్టు చైనాను 1-0తో చిత్తు చేసి మరోసారి ఛాంపియన్ అయింది. 31వ నిమిషంలో దీపిక చేసిన గోల్‌తో భారత్‌కు విజయం దక్కించింది.

తొలి అర్ధ భాగంలో అటు భారత్ గానీ, ఇటు ప్రత్యర్థి చైనా మహిళలు గానీ ఒక్క గోల్ కూడా చేయలేకపోయారు. కొన్ని పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చినా భారత్ వాటిని గోల్స్‌గా చేయలేకపోయింది. అయితే మూడో క్వార్టర్ మొదలైన వెంటనే పెనాల్టీ కార్నర్‌ను దీపిక గోల్‌గా మలిచి భారత శిబిరంలో ఆనందాన్ని నింపింది.
కనీసం ఒక్క గోల్ సాధించిన స్కోర్ సమం చేయాలని చైనా మహిళలు ఎంత ప్రయత్నించినా సఫలం కాలేదు. దాంతో రెండో అర్ధభాగం ముగిసిన తరువాత 1-0 గోల్స్ తేడాతో భారత్ విజయభేరి మోగించింది. ఒక్క మ్యాచ్ సైతం ఓడకుండా అజేయంగా భారత అమ్మాయిలు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గారు. గతంలో దక్షిణ కొరియా 3 సార్లు ఈ ట్రోఫీని నెగ్గడా, తాజాగా భారత్ ఈ రికార్డును సమం చేసింది.