InPics: విడాకులు తీసుకున్న టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ దంపతులు... 9 ఏళ్ల వివాహ బంధానికి తెర
టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ తన భార్య అయేషా ముఖర్జీ విడాకులు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశిఖర్ ధావన్, అయేషా ముఖర్జీ వివాహం చేసుకుని తొమ్మిదేళ్లయింది. 2012 లో ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ధావన్, అయేషాకు జోరావర్ అనే కుమారుడు కూడా ఉన్నాడు.
శిఖర్ కంటే అయేషా 10 సంవత్సరాలు పెద్దది. ధావన్ పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
గత ఏడాది నుంచి వీరిద్దరూ సఖ్యతగా ఉండటం లేదని, ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుందనే వార్తలు గుప్పమన్నాయి. అంతేకాదు.. సోషల్ మీడియాలో ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో అయ్యారు.
అయేషా ఇన్‌స్టాలో చేసిన పోస్ట్‌లో ఇలా రాసింది.. ‘మొదటిసారి విడాకులు తీసుకున్నప్పుడు ఎలా అనిపించిందో.. రెండోసారి విడాకులు తీసుకున్నప్పుడు కూడా అంతే భయంకరంగా అనిపిస్తోంది. ప్రమాదంలో ఉన్నట్లు అనిపించింది.
నేనేంటో నిరూపించుకోవడానికి ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఈ సమయంలో రెండోసారి కూడా విడాకులు తీసుకోవడం చాలా భయానకంగా అనిపిస్తోంది. విడాకులు అనే పదం ఒక చెత్తం పదం అని భావించాను. కానీ నేను రెండు సార్లు విడాకులు తీసుకున్నాను.’’ అంటూ అయేషా రాసుకొచ్చింది.
అయేషా తాజాగా తన ఇన్‌స్టాగ్రమ్ ఖాతా నుంచి శిఖర్ ధావన్ ఫోటోలను పూర్తిగా తొలగించింది. ధావన్ ఇన్‌స్టాలో మాత్రం అయేషా ఫోటోలు ఉండటం విశేషం.