IPL 2021: UAEలో శ్రేయస్ అయ్యర్ ప్రాక్టీస్... ఫొటోలు పంచుకున్న అయ్యర్... సెప్టెంబర్ 22న DC vs SRH
ఈ నెల 19న తిరిగి ప్రారంభంకానున్న IPL 2021 కోసం ఇప్పటికే పలువురు ఆటగాళ్లు UAE చేరుకున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఎప్పుడో UAE చేరుకున్నాడు.
క్వారంటైన్ పూర్తి చేసుకుని వరుస ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంటున్నాడు.
బ్యాటింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంటున్నాడు.
ఈ సందర్భంగా తాను ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొన్న ఫొటోలను అయ్యర్ ట్విటర్ ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నాడు.
అయ్యర్ గాయం కారణంగా మొదటి విడత IPL - 2021 ఆడలేదు.
ఇప్పుడు గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఫామ్ కోసం కష్టపడుతున్నాడు.
అయ్యర్ స్థానంలో రిషబ్ పంత్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు. ఇప్పుడు అయ్యర్ తిరిగి రావడంతో మిగతా సీజన్‌కి ఎవరు కెప్టెన్సీ నిర్వహిస్తారో తెలియాల్సి ఉంది.
ఈ నెల 22న దిల్లీ క్యాపిటల్స్... సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.