Paris Olympics 2024: అట్టహాసంగా ప్రారంభమైన విశ్వ క్రీడా సంబరం
ముసుగు ధరించి... ఫ్రాన్స్ చరిత్రను తెరిచి.. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలో ముసుగు ధరించిన వ్యక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. టార్చ్ పట్టుకుని ముందుకు నడుస్తూ ఫ్రెంచ్ చరిత్రను కళ్లకు కట్టాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో ఫ్రాన్స్ సైక్లిస్ట్‌లు చేసిన విన్యాసాలు గగుర్పాటుకు గురి చేశాయి. సంప్రదాయ నృత్యాన్ని తలపించేలా దుస్తులు ధరించిన సైక్లిస్ట్‌లు అద్భుత విన్యాసాలతో ఆకట్టుకున్నారు
అద్భుతంగా జరిగిన పాప్ సింగర్ లేడీ గాగా ప్రదర్శన
కన్నుల పడువగా సాగిన ఈ వేడుకల కోసం విడుదల చేసిన టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోాయాయి.
పేరెన్నిక గల ఫ్రాన్స్ పాప్ స్టార్స్ ఈ వేడుకలలో ఉత్సాహంగా ప్రదర్శనలు చేశారు.
ఫ్రాన్ సంస్కృతి సాంప్రదాయాలను చాటేలా విశ్వ క్రీడల ప్రారంభోత్సవం సాగింది. ఇందులో ప్రదర్శనకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
నదికి ఇరువైపులా ఏర్పాటు చేసిన సంగీత ప్రదర్శనలు, నృత్య ప్రదర్శనలు అలరించాయి.
ఈ సారి ప్రత్యేకంగా ఈఫిల్ టవర్ లోని ఇనుప ముక్కలను ఒలింపిక్ పతకంలో చేర్చారు.
ఫ్రాన్స్ సత్తాను చాటేలా గగనతలంలోనూ వేడుకలను నిర్వహించారు. ఈఫిల్ టవర్‌పై జరిగిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
పారిస్ నగర నడిబొడ్డను.. చారిత్రక ప్రదేశాలను తాకుతూ వివిధ దేశాల అథ్లెట్ల పడవలు ముందుకుసాగాయి. వీటిని చూసేందుకు క్రీడాభిమానులకు రెండు కళ్లు సరిపోలేదు.