Rajinikanth: మనవడిని స్వయంగా స్కూల్‌కు తీసుకువెళ్లిన రజనీ - బెస్ట్ గ్రాండ్‌ఫాదర్ అంటూ మురిసిపోయిన కూతురు
Super Star Rajinikanth: తలైవా రజనీకాంత్ సింప్లిసిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ అయినా సాధారణ వ్యక్తిలా ఉండటానికే ఆయన ఇష్టపడతారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న తలైవా తాజాగా చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అంతేకాదు బెస్ట్ గ్రాండ్ ఫాదర్ అంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇంతకి ఏమైందంటే.
రజనీ చిన్న కూతురు సౌందర్య రజనీకాంత్‌కు ఇద్దరు కొడుకులు అనే విషయం తెలిసిందే. అయితే ఆమె పెద్ద కుమారుడు వేద్ స్కూల్ వెళ్లనని ఈ రోజరు మారాం చేశాడట. దీంతో తలైవా తాతగా తన బాధ్యతను నిర్వర్తించారు.
స్కూల్‌కి వెళ్లనని మారాం చేస్తున్న మనవడిని స్వయంగా స్కూల్‌కు తీసుకువేళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయన కూతురు సౌందర్య రజనీకాంత్ షేర్ చేస్తూ బెస్ట్ గ్రాండ్ ఫాదర్ బిరుదు ఇచ్చారు.
ఇవాళ ఉదయం నా కుమారుడు స్కూల్ వెళ్లనని మారాం చేస్తుంటే. తన ప్రియమైన సూపర్‌హీరో తాత స్వయంగా వేద్‌ని స్కూల్లో దిగబెట్టారు.
ఆఫ్ స్క్రీన్‌లో అయినా ఆన్ స్క్రీన్‌లో అయినా ప్రతి పాత్రనూ మీరు ఉత్తమంగా పోషిస్తారు నాన్నా.. బెస్ట్ గ్రాండ్‌ఫాదర్ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.