Paris Olympics 2024: భారత దేశం తరపున బరిలో దిగనున్న ఆటగాళ్ళు
మన దేశం నుంచి అథ్లెటిక్స్ విభాగంలో అత్యధికంగా 29 మంది పోటీపడనున్నారు. ఆ తర్వాత అత్యధికంగా 21 మంది షూటర్లు ఉన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ ఏడాది 72 మంది భారత ఒలింపియన్లు తొలిసారిగా ఒలింపిక్స్లో పోటీ పడనున్నారు. అంటే మొత్తం సంఖ్యలో 62 శాతం మంది కొత్తవారే. అలాగే ఈ సారి పాల్గొననున్న 117మంది క్రీడాకారుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు 8 మంది ఉన్నారు.
మన దేశం తరపున ఒలింపిక్స్ లో పాల్గొంటున్న అత్యంత చిన్న వయసు వ్యక్తి 14 ఏళ్ల స్విమ్మర్ ధీనిధి దేశింగు.
44 ఏళ్ల టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న ఈ ఏడాది ఒలింపిక్స్లో మన దేశం తరపున పాల్గొనే అత్యంతపెద్ద వయస్సు ఉన్న వ్యక్తి .
హర్యానా రాష్ట్రం నుంచి అత్యధికంగా 24 మంది ఒలింపియన్లు భారత్కు పతకం సాధించాలనే ఆశతో ఈ ఏడాది పారిస్లో పోటీపడనున్నారు. ఈ 24 మందిలో నీరజ్ చోప్రా కూడా ఉన్నాడు.
ఈ ఏడాది ఒలింపిక్స్లో దేశం తరఫున ఐదుగురు ఒలింపిక్ పతక విజేతలు కనిపించనున్నారు. వారు నీరజ్ చోప్రా, పివి సింధు, లవ్లీనా బరాగోహై, మీరాబాయి చాను, భారత హాకీ జట్టు.
గత ఒలింపిక్స్లో పాల్గొన్నవారి కంటే ఈసారి క్రీడాకారుల సంఖ్య తగ్గినా సాధించే పతకాల సంఖ్య మాత్రం పెరుగుతుందని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు.