Raju Yadav Streaming: ఆహాలో అదరగొడుతున్న రాజు యాదవ్... ఓటీటీలో సూపర్బ్ రెస్పాన్స్
తెలుగులోనూ ఇటీవల డిఫరెంట్ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు వస్తున్నాయి. అటువంటి చిత్రాల జాబితాలో 'రాజు యాదవ్' ఉంటుంది. టీవీ షోలతో టాలెంటెడ్ ఆర్టిస్ట్ అని పేరు తెచ్చుకున్న జబర్దస్త్ కమెడియన్ 'గెటప్' శ్రీను ఇందులో హీరో. క్రికెట్ బాల్ తగలడంతో ఎప్పుడూ నవ్వుతూ ఉండే లోపంతో తెరకెక్కింది. ఇందులో అంకిత ఖరత్ కథానాయికగా, ఆనంద చక్రపాణి హీరో తండ్రి పాత్రలో నటించారు.

ఆహా ఓటీటీలో 'రాజు యాదవ్' స్ట్రీమింగ్ అవుతోంది. 'గెటప్' శ్రీను నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. ఆయన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని సర్వత్రా ప్రశంసలు లభించాయి. ముఖం మీద ఎప్పుడూ నవ్వుతూ అలా నటించడం అంత సులభం కాదని ఫస్టాఫ్ నవ్వించిన ఆయన, సెకండాఫ్ ఎమోషనల్ నటనతో అదరగొట్టారు. ముఖ్యంగా చివరి 20 నిముషాలు, గెటప్ శ్రీను - ఆనంద చక్రపాణి నటన సినిమాకు బలంగా నిలిచాయి.
'రాజు యాదవ్' నటన విషయానికి వస్తే... ప్రేమ పేరుతో ఓ అమ్మాయి చేసిన మోసం వల్ల ఓ అబ్బాయి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అపరిపక్వమైన ఆలోచనలు ఉన్న ఓ యువకుడి ప్రేమకథగా ఈ సినిమా రూపొందింది. క్రికెట్ బాల్ తగలడంతో ఓ యువకుడి ముఖం ఎలా మారింది? ప్రేమించిన అమ్మాయి కోసం ఆమె హైదరాబాద్ వెళ్లాక క్యాబ్ డ్రైవర్ గా ఎందుకు మారాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
'గెటప్' శ్రీను సరసన అంకిత కరత్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో ఆనంద చక్రపాణి, 'మిర్చి' హేమంత్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కృష్ణమాచారి రచయిత, దర్శకుడు.
'రాజు యాదవ్' సినిమాను ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లేపల్లి నిర్మించగా... హర్షవర్దన్ రామేశ్వర్, సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. సాయి రామ్ ఉదయ్ కెమెరా వర్క్ అందించారు. ఈ సినిమాను Aha OTTలో చూడండి.