Neeraj Chopra: గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా.. ఎలా ప్రాక్టిస్ చేశారో చూడండి

ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో తొలి పతకం కోసం 100 ఏళ్లుగా నిరీక్షించిన భారత్ కల ఫలించింది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా పసిడి పతకం సాధించాడు. 23 ఏళ్ల ఈ కుర్రాడు స్వర్ణం గెలిచి భారత్ గర్వించేలా చేశాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
జావెలిన్‌ను అత్యుత్తమంగా 87.58 మీ. దూరానికి నీరజ్ విసిరాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన వాద్లెచ్ జాకుబ్-86.67, వెసెలీ విటెజ్స్లావ్-85.44 రజత, కాంస్య పతకాలు సాధించారు.

భారత్‌కు ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగంలో అభినవ్ బింద్రా సాధించిన స్వర్ణం తర్వాత రెండో క్రీడాకారుడిగా నీరజ్ చోప్రా రికార్డు సృష్టించాడు.
ఒకవైపు చదువును కొనసాగిస్తూనే నీరజ్ 2013లో ప్రపంచ యూత్ ఛాంపియన్షిప్, 2015లో ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. పతకాలు రాకున్నా.. మంచి ప్రదర్శనే చేశాడు.
2016 నుంచి నీరజ్ కెరీర్.. పతకాలు, రికార్డులతో విజయ పథంలో పరుగులు తీస్తోంది. 2018లో గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత కేంద్రం నీరజ్‌ను అర్జున అవార్డుతో సత్కరించింది.