National Handloom Day: గొల్లభామ చీరలు ఇక్కడే స్పెషల్.. తెలంగాణ నేతన్నలకు ప్రత్యేక గుర్తింపు: కేటీఆర్
హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏటా జాతీయ చేనేత దినోత్సవాన్ని తెలంగాణలో ఘనంగా జరుపుకుంటున్నామని కేటీఆర్ అన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2018 నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో చేనేత కళాకారులను సత్కరించి, పురస్కారాలు అందిస్తున్నామని కేటీఆర్ అన్నారు. అవార్డుతో పాటు రూ.25 వేల నగదు కూడా అందిస్తున్నామని అన్నారు. ఈ ఏడాది 31 మంది చేనేత కళాకారులను సత్కరించుకున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఏటా ఎగ్జిబిషన్ నిర్వహించి, చేనేత వస్త్రాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు.
తెలంగాణలో ఉన్న ఈ ప్రత్యేకమైన నైపుణ్యాన్ని దేశ ప్రజలకు తెలిపేందుకు ఈ-కామర్స్ ద్వారా ఈ-గోల్కొండ పోర్టల్‌ను రూపొందించుకున్నామని కేటీఆర్ తెలిపారు. వీటి ద్వారా చేనేత అమ్మకాలను విక్రయిస్తున్నట్లు చెప్పారు.
డబుల్ ఇక్కత్, ఆర్మూర్ పట్టుచీరలు, జరీ చీరలు, సిద్దిపేట గొల్లభామ చీరలు తెలంగాణ సమాజంలో అందరి ముందు కదలాడుతున్నాయి. ఆధునికమైన సాంకేతికతతో కొత్త డిజైన్లను రూపొందిస్తున్నామని తెలిపారు. కొత్త ఆలోచనలతో వచ్చే నేత కళాకారులను ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు.
చేనేత కార్మికుల సంక్షేమ కోసం పెద్ద ఎత్తున బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నామని.. నేతన్నకు చేయూత ద్వారా కళాకారులకు భరోసా ఇస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ‘చేనేత మిత్ర’ కింద నూలు, రసాయనాలు, రంగులను 50 శాతం సబ్సిడీతో కార్మికులకు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ తరాన్ని ఆకట్టుకునేలా చేనేత ఉత్పత్తులను తీర్చిదిద్దుతున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు.