Indian Hockey Team: పతక వీరులకు అఖండ స్వాగతం
టోక్యో ఒలింపిక్స్, పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యంతో మెరిసిన భారత హాకీ జట్టుకు దేశ రాజధాని ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appభారత హాకీ జట్టుకు హర్మన్‌ప్రీత్ సింగ్ సారధ్యం వహించాడు. కీలకమైన మ్యాచుల్లో పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచి భారత్‌కు విజయం అందించాడు,.
1968, 1972 తర్వాత ఒలింపిక్స్‌లో భారత్ హాకీ జట్టు వరుసగా రెండు పతకాలాు సాధించింది. మళ్లీ 52 ఏళ్ల తర్వాత భారత్ వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించింది.
2021 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ జర్మనీని ఓడించి కాంస్యం సాధించింది. 41 ఏళ్ల పతకాల కరువుకు గత ఒలింపిక్స్ భారత జట్టు తెరదించింది.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు స్పెయిన్‌ను ఓడించి కాంస్యం సాధించింది. కాంస్య పతక పోరులో భారత్ 2-1 తేడాతో విజయం సాధించింది.
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన తర్వాత స్వదేశానికి వచ్చిన తమకు ఇంతటి ఘన స్వాగతం లభించడం చూసి తాను ముగ్ధుడనయ్యానని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ తెలిపాడు.
పారిస్ నుంచి భారత్ చేరుకున్న హాకీ ఆటగాళ్లు హర్మన్‌ప్రీత్, సుఖ్జిత్, అమిత్ రుయిడాస్కు ఘన స్వాగతం లభించింది. న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహానికి హాకీ క్రీడాకారులు పూలమాలలు నివాళులు అర్పించారు.
ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు రెచ్చిపోయింది. గ్రూప్ దశలో ఆస్ట్రేలియాపై భారత్ 3-2తో విజయం సాధించింది. 52 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాను భారత్ ఓడించింది.