In Pics: టోక్యోలో ఆడిన ఒడిశా హాకీ ప్లేయర్లను సన్మానించిన నవీన్ పట్నాయక్... రూ.2.5కోట్ల నజరానా, DSP ఉద్యోగం
టోక్యో ఒలింపిక్స్‌లో ఆడిన ఒడిశాకు చెందిన హాకీ ప్లేయర్లను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కలిశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సందర్భంగా కాంస్య పతకం సాధించిన పురుషుల జట్టులోని ఆటగాళ్లకు ఒక్కొక్కరికీ రూ.2.5కోట్లు, కాంస్య పోరులో తలపడిన మహిళల జట్టులోని ఇద్దరు ప్లేయర్లకు ఒక్కొక్కరికీ రూ.50లక్షలు ప్రోత్సాహం అందించారు.
ఒలింపిక్స్‌కి వెళ్లే ముందే నవీన్ పట్నాయక్ ఈ ప్రోత్సాహకాలను ప్రకటించారు. హాకీ జట్టు పతకం గెలిస్తే జట్టులోని ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆటగాళ్లకు ఒక్కొక్కరికీ రూ.2.5 కోట్లు అందజేస్తానన్నారు.
ఈ క్రమంలో ఒడిశా క్రీడాకారులు అమిత్, బీరేందర్కి ఒక్కొక్కరికీ రూ.2.5కోట్ల చెక్కులను అందజేశారు.
అలాగే కాంస్య పతక పోరులో గ్రేట్ బ్రిటన్‌తో తలపడిన మహిళల హాకీ జట్టులోని ఇద్దరు ఒడిశా అమ్మాయిలకు పట్నాయక్ ప్రోత్సాహకాలు అందించారు.
నమిత, గ్రేస్ ఎక్కా ఒక్కొక్కరికీ రూ.50లక్షలు అందజేశారు. భవిష్యత్తులో అండగా ఉంటానని క్రీడాకారులకు హామీ ఇచ్చారు.
అంతేకాదు అమిత్, బీరేందర్కి డీఎస్పీ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. హాకీ క్రీడాకారులు సంతకం చేసిన జెర్సీని నవీన్ పట్నాయక్‌కి అందజేశారు.