Ind vs Eng: లార్డ్స్ మైదానంలో టీమిండియా ప్రాక్టీస్... ఫీల్టింగ్ పై ప్రత్యేక దృష్టి
భారత్Xఇంగ్లాండ్ మధ్య గురువారం నుంచి రెండో టెస్టు ప్రారంభంకానుంది. లార్డ్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
మ్యాచ్‌కి ముందు ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా పాల్గొంది.
ప్రాక్టీస్ సెషన్లో భారత ఆటగాడు శార్దూల్ ఠాకూర్ గాయపడ్డాడు. దీంతో అతడు రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడా అన్న దానిపై అనుమానాలు నెలకొన్నాయి.
ఒకవేళ శార్దూల్ ఠాకూర్ అందుబాటులో లేకపోతే అతడి స్థానంలో ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ ఎవరికో ఒకరికి తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.
తొలి టెస్టులో గోల్డెన్ డకౌట్ అయిన కోహ్లీ రెండో టెస్టులో ఫామ్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
రెండో టెస్టు కోసం భారత ఆటగాళ్లు ఎక్కువగా ఫీల్డింగ్ పై దృష్టి పెట్టారు.
మరో పక్క ఇంగ్లాండ్ జట్టు ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్ కూడా గాయపడ్డాడు.
తొలి టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇరు జట్లకూ ఐసీసీ రెండేసి డబ్ల్యూటీసీ పాయింట్లు కోత పెట్టడంతోపాటు 40 శాతం జరిమానా విధించింది.
మరి, రెండో టెస్టులో ఏ జట్టు విజయం సాధిస్తుందో, కోహ్లీ శతకం సాధిస్తాడో లేదో చూడాలి.