In Pics: హుజూరాబాద్‌లో రంగంలోకి దిగిన హరీశ్ రావు.. కార్యకర్తల్లో జోష్.. ఫోటోలు
హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ను టీఆర్ఎస్ అధిష్ఠానం ప్రకటించిన వేళ మంత్రి హరీశ్ రావు రంగంలోకి దిగారు. హుజూరాబాద్ మండలంలోని కేసీ క్యాంప్ వద్ద ఆర్థిక మంత్రి హరీష్ రావుకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆయనతో పాటు మంత్రి గంగుల కమలాకర్ కూడా ఉన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపలు గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలు మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్‌తో కలిసి కేసీ క్యాంప్ నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
తొలుత అమరవీరుల స్థూపానికి ఇద్దరు మంత్రులు నివాళులు అర్పించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. జై తెలంగాణ, జై టీఆర్ఎస్ నినాదాలతో హుజూరాబాద్ మార్మోగిపోయింది.
ఈ నెల 16న హుజూరాబాద్ మండలం శాలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఉన్నందున అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్ ఈ సందర్భంగా పరిశీలించారు.
హుజూరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించడంతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
గెల్లు శ్రీనివాస్ పేరును ప్రకటించగానే పెద్ద ఎత్తున సంబరాలు మొదలయ్యాయి. టపాసులు కాల్చుతూ స్వీట్లు పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు.