KKR Vs SRH Match Highlights: కేకేఆర్ పేరు మీద ఆ బెస్ట్ రికార్డు- ఎస్ఆర్హెచ్ పేరుతో ఆ చెత్త రికార్డు -ఐపీఎల్ 2024 కథే వేరు
ఐపీఎల్ 2024 చాలా రికార్డులను సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లోనూ పలు రికార్డులు రిజిస్టర్ అయ్యాయి. అందులో కొన్ని బెస్ట్ రికార్డ్స్ ఉంటే మరికొన్ని చెత్త రికార్డ్స్ ఉన్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఐపీఎల్ 2024లో దుమ్ము రేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ మూడోసారి టైటిల్ ఎగరేసుకుపోయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించారు కేకేఆర్ ఆటగాళ్లు. ప్రతి మ్యాచ్‌లో ది బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
ఐపీఎల్ అందుకున్న కెప్టెన్లలో శ్రేయస్ అయ్యర్ ఎనిమిదో వ్యక్తి. అతని కంటే ముందు షేన్‌వార్న్, గిల్‌క్రిస్ట్, ధోనీ, గంభీర్, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, హార్దిక్ పాండ్యా ఉన్నారు. వాళ్ల సరసన ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ చేరారు.
ఐపీఎల్లో కోల్‌కతాకు ఇది మూడోటైటిల్. ఇలా మూడు కంటే ఎక్కువ సార్లు ఐపీఎల్ టైటిల్ తీసుకున్న సీఎస్కే, ముంబై ఇండియన్ సరసన చేరింది. సీఎస్కే, ముంబై ఇండియన్స్ ఐదేసి సార్లు టైటిల్ నెగ్గాయి.
ఐపీఎల్ 2024లో వరుస మ్యాచ్‌లలో వెంకటేష్ అయ్యర్ హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇలా వరుస నాలుగు మ్యాచ్‌లలో ఫిఫ్టీ చేసిన తొలి బ్యాటర్‌గా వెంకటేష్ అయ్యర్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.
ఐపీఎల్ 2024 ఫైనల్లో హైదరాబాద్ ఇచ్చిన స్వల్ప లక్ష్యం 113 పరుగులను కేవలం 63 బంతుల్లోనే కేకేఆర్ కొట్టేసింది. ఇది చెపాక్ స్టేడియంలో ఇప్పటి వరకు ఇతి పెద్ద విన్నింగ్ మ్యాచ్ అన్నమాట. చెపాక్‌లో భారీ విజయం సాధించిన జట్టుగా కేకేఆర్ నిలిచింది.
ఐపీఎల్ 17 సీజన్లలో మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు 9 సార్లు విజయం సాధిస్తే 8 సార్లు ఛేజింగ్ చేసిన జట్టు విజేతగా నిలిచింది. ఇప్పటి వరకు ఫైనల్లో ఒక్క జట్టు కూడా ఆలౌట్ కాలేదు. ఇప్పుడు ఆ రికార్డు సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరు మీద రిజిస్టర్ అయ్యింది
ఐపీఎల్ 2024 ట్రోఫీతో షారుక్‌ఖాన్