IPL 16 Winner CSK: ఐపీఎల్ ట్రోఫీతో నేరుగా శ్రీవారి ఆలయానికి వెళ్లి సీఎస్కే ప్రత్యేక పూజలు
సోమవారం గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ సీజన్ 16 టైటిల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ ఘనవిజయం సాధించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచివరి బాల్ వరకు సాగిన ఉత్కంఠ పోరులో సీఎస్కె సాధించిన టైటిల్ కప్పును శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చెన్నై లోని వెంకట నారాయణ రోడ్డులో టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయానికి నేరుగా టైటిల్ ట్రోఫీని తీసుకొచ్చారు, అనంతరం ప్రత్యేక పూజలు
తమిళనాడు టీటీడీ ఎల్ఏసీ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎస్కే అధినేత శ్రీనివాసన్ చేతుల మీదుగా ట్రోఫీని ఆలయానికి తరలించారు.
అనంతరం ఆలయ అర్చకులు ఐపీఎల్ ట్రోఫీకి వేద మంత్రోచ్చారణ నడుమ ఆశీర్వచనం అందించారు.
ఐపీఎల్ ట్రోఫీకి శ్రీవారి సన్నిధిలో పూజల అనంతరం శ్రీనివాసన్ ను ఆలయ అర్చకులు పట్టువస్త్రంతో సత్కరించారు.
ఐపీఎల్ లో ఇది చెన్నై సూపర్ కింగ్స్ కు 5వ ట్రోఫీ. ధోనీ కెప్టెన్సీలో సీఎస్కే తాజా ఐపీఎల్ ట్రోఫీ కైవసం చేసుకుంది.
తమకు ఎంతో ప్రత్యేకమైన శ్రీనివాసుడి చెంతకు తెవాలని ట్రోఫీని తీసుకొచ్చి పూజలు నిర్వహించారు సీఎస్కే యాజమాన్యం, తమిళనాడు టీటీడీ ఎల్ఏసీ ప్రెసిడెంట్