Kavya Maran : వణుకు పుట్టించారు- కాలర్ ఎగరేసుకుని తిరగండి- టీం సభ్యులతో కావ్యా మారన్ కామెంట్స్

ఐపీఎల్ ఫైనల్లో కోల్ కతా చేతిలో ఓడిపోయాక సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ తన టీమ్ తో మాట్లాడారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
కోచ్ డానియెల్ వెట్టోరీ, కెప్టెన్ ప్యాట్ కమిన్స్, హెడ్ సహా టీమ్ ప్లేయర్లంతా డ్రెస్సింగ్ రూమ్ లో ఉండగా వచ్చిన కావ్యా...ప్రతీ ప్లేయర్ ను అభినందించారు.

ఒక్క ఓటమో, గెలుపో ఈ ఏడాది సన్ రైజర్స్ ఆటను డిఫైన్ చేయలేదన్న కావ్యా... గతేడాది పాయింట్స్ టేబుల్లో ఆఖరి స్థానంలో ఉన్నా మన కోసం మన ఆటను సపోర్ట్ చేయటం కోసం వచ్చిన ఫ్యాన్స్ అందరినీ సన్ రైజర్స్ ప్లేయర్లు గర్వపడేలా చేశారన్నారు.
ఫైనల్లో ఓడిపోయామని ఐపీఎల్ కప్ పోయిందని బాధపడాల్సిన అవసరం లేదన్న సన్‌రైజర్స్ ఓనర్... ప్లేయర్లు ఇలా డల్‌గా ఉంటే తను చూడలేనన్నారు.
మిగిలిన మ్యాచుల్లానే దీన్ని ఒక మ్యాచుగా చూడాలని ఓటమిని మర్చిపోయి మళ్లీ వచ్చే ఏడాది ఇంకా స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరారు.
కావ్యా మారన్ స్పీచ్ కు సన్ రైజర్స్ టీమ్ అంతా చప్పట్లతో అభినందనలు తెలిపారు. వాస్తవానికి మ్యాచ్ కోల్పోయాక ఆటగాళ్లే కంటే కావ్యా మారనే ఎక్కువగా ఎమోషనల్ అయ్యారు.
స్టేడియంలో అందరూ చూస్తుండగానే కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతలోనే కోలుకుని అందరినీ అప్రిషియేట్ చేశారు.
ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో కావ్యా టీమ్ కి చెప్పిన మాటలను సన్ రైజర్స్ వీడియో రూపంలో పోస్ట్ చేసింది.
ట్రావియెస్ హెడ్ కావ్యా మారన్ వీడియోను రీ షేర్ చేయటంతో పాటు కావ్యా మారన్ ది బెస్ట్ ఓనర్ అంటూ తన ట్విట్టర్లో రాసుకొచ్చాడు.