IPL 2025 SunRisers Hyderabad: కాటేరమ్మ కొడుకులు తగ్గేదేలే, ఈసారి మరింత బలంగా SRH - ఆరెంజ్ ఆర్మీ బలాలివే

అభిషేక్ శర్మ ఫియర్లెస్ బ్యాటింగ్ SRHకు ప్లస్ పాయింట్. ఎలాంటి పరిస్థితులోనైనా సిక్సర్లు కొట్టడంలో సిద్ధహస్తుడు. పవర్ ప్లే తరువాత సైతం వేగంగా ఇన్నింగ్స్ నిర్మిస్తాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ సైతం బ్యాటింగ్‌లో సన్‌రైజర్స్‌కు కీలకం. వేగంగా ఆడి పరుగులు స్కోర్ చేస్తాడు. యార్కర్లను సరిగ్గా ఎదుర్కోగలిగితే ఇతడికి తిరుగు లేదు.

ఇషాన్ కిషాన్ రాకతో సన్ రైజర్స్ బ్యాటింగ్ బలం మరింతగా పెరిగింది. ప్యాకెట్ డైనమెట్‌గా పేరున్న ఇషాన్ వన్ డౌన్లో దిగే ఛాన్స్ ఉంది. ఇంట్రా స్క్వాడ్ పోటీల్లో సత్తా చాటాడు.
తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో రాణిస్తున్నాడు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో కీలక సమయంలో పరుగులు స్కోర్ చేసే సత్తా అతడి సొంతం.
మిడిలార్డర్లో హెన్రిచ్ క్లాసెన్ జట్టుకు కీలక బ్యాటర్. నిలుచున్న చోటునుంచే అలవోకగా సిక్సులు బాదడంలో సఫారీ బ్యాటర్ దిట్ట. స్కోరు వేగాన్ని అమాంతం పెంచగలడు.
ఆసీస్‌కు ఐసీసీ ట్రోఫీలు అందించిన అనుభవం పాట్ కమిన్స్ సొంతం. తొలి ప్రయత్నంలోనే సన్‌రైజర్స్‌ను ఫైనల్ చేర్చిన కెప్టెన్ గా రికార్డు ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటిన మహ్మద్ షమీ టాపార్డర్ వికెట్లు తీసి ఆరంభంలోనే జట్టుకు బ్రేక్ ఇచ్చే బౌలర్.
ఆడమ్ జంపా చేరికతో సన్‌రైజర్స్ బౌలింగ్ పటిష్టంగా మారింది. కీలక సమయంలో వికెట్లు తీసి కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టే స్పిన్నర్.