IPL 2025 KKR vs RCB: అదరగొట్టిన ఆర్సీబీ .. మెరిసిన సాల్ట్, కోహ్లి, కృనాల్.. ఫోటోలివిగో

. ఐపీఎల్ 18వ సీజన్ సందడి చేస్తోంది. క్రికెట్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ అందిస్తోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శుభారంభం చేసింది. శనివారం టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తుగా ఓడించింది.

టాస్ గెలిచిన ఆర్సీబీ, మొదట బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేకేఆర్ 174 పరుగులకే పరిమితమైంది.
కెప్టెన్ రహానె, సునీల్ నరైన్ బలమైన పునాది వేసినా.. మిగతా బ్యాటర్ల వైఫల్యం ఆ జట్టును దెబ్బతీసింది.
175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఆరంభం నుంచే దూకుడుగా చూపించింది. .
సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కళ్లు చెదిరే షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
95 వద్ద సాల్ట్ ఔటైనా కంగారు పడాల్సిన అవసరం లేకుండా కోహ్లి చక్కని బ్యాటింగ్‌ను కొనసాగించాడు.
ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 16.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసి ఆర్సీబీ విజయం సాధించి, తమ సీజన్‌ను ఘనంగా ఆరంభించింది.