LSG vs MI: గంభీర్ కళ్లల్లో ఆనందం చూసేందుకే..!

కఠిన పిచ్‌పై లక్నో సూపర్ జెయింట్స్ అదరగొట్టింది! ప్లేఆఫ్ రేసులో మరింత ముందుకెళ్లింది. భీకరమైన ముంబయి ఇండియన్స్‌ను వెనక్కి నెట్టింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
చావోరేవోగా మారిన మ్యాచులో 177 స్కోర్‌ను డిఫెండ్ చేసుకుంది. హిట్‌మ్యాన్ సేనను 172/5కి పరిమితం చేసింది.

ఇషాన్ కిషన్ (59; 39 బంతుల్లో 8x4, 1x6), రోహిత్ శర్మ (37; 25 బంతుల్లో 1x4, 3x6) అదరగొట్టారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (32*; 19 బంతుల్లో 1x4, 3x6) భయపెట్టాడు.
అంతకు ముందు ఎల్ఎస్జీలో మార్కస్ స్టాయినిస్ (89*; 47 బంతుల్లో 4x7, 8x6) విశ్వరూపం ప్రదర్శించాడు. కృనాల్ పాండ్య (49; 42 బంతుల్లో 1x4, 1x6) అతడికి అండగా నిలిచాడు.
ముంబయికి 6 బంతుల్లో 11 రన్స్ అవసరం కాగా మొహిసిన్ ఖాన్ 5 పరుగులు ఇచ్చి లక్నోను గెలిపించాడు.
మ్యాచ్ ముగిశాక లక్నో సూపర్ జెయింట్స్ ఆనందంతో గంతులేసింది. సంబరాలు చేసుకుంది. గౌతమ్ గంభీర్ ఎగ్జైటింగ్ ఫీలయ్యాడు.
హోమ్ గ్రౌండ్ ఏకనాలో లక్నోకు ఇదే చివరి మ్యాచ్. తమకు అండగా నిలిచిన అభిమానులకు లక్నో అభివాదం చేసింది.