Tokyo Olympic Gold medal: టోక్యో ఒలింపిక్స్ పతకాల ప్రత్యేకత ఏంటో తెలుసా? పతకాలను వేటితో తయారు చేశారు?
ఒలింపిక్ మెడల్ ఏ క్రీడాకారుడికైనా ఎంతో ప్రత్యేకం. తమ కెరీర్లో ఒలింపిక్స్‌లో పాల్గొని ఒక్కసారైనా పతకం గెలవాలని ప్రతి క్రీడాకారుడు కలలు కంటుంటాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appక్రీడాకారులకి అంత ప్రత్యేకమైన ఈ పతకాలు ఎలా తయారు చేస్తారు? పతకాల తయారీలో ఏమేమి వాడతారో ఇప్పుడు చూద్దాం.
జపాన్‌కు చెందిన ప్రముఖ డిజైనర్ జునిచీ కవానిషి పతకాల డిజైన రూపొందించారు. దేశవ్యాప్తంగా పతకాల డిజైన్లకు ఎంట్రీలు ఆహ్వానించగా.. వందలాది మంది పోటీపడ్డారు. చివరకు జునిచీకి ఈ డిజైనింగ్ బాధ్యతలు కట్టబెట్టారు.
టోక్యో ఒలింపిక్స్‌లో ప్రదానం చేయనున్న పతకాలను జపాన్‌కు చెందిన ప్రముఖ డిజైనర్ జునిచీ కవానిషి రూపొందించారు. దేశవ్యాప్తంగా పతకాల డిజైన్లకు ఆహ్వానించగా.. వందలాది మంది నుంచి వడపోసి చివరకు జునిచీకి ఈ డిజైనింగ్ బాధ్యతలు కట్టబెట్టారు.
గోల్డ్ మెడల్ 556 గ్రాముల బరువు ఉంటుంది. సిల్వర్ మెడల్ 550 గ్రాములు, బ్రాంజ్ 450 గ్రామల బరువు ఉంటుంది.
గోల్డ్, సిల్వర్ మెడల్లో 550 గ్రాముల స్వచ్ఛమైన వెండిని ఉపయోగించారు. కాకపోతే స్వర్ణ పతకం వెండితో రూపొందించి పైన 6 గ్రాముల బంగారు పూతను పూశారు.
ఇక, ఈ పతకాలు స్పెషల్ వుడ్ తో తయారు చేసిన బాక్స్ లో ఉంచి అథ్లెట్లకు ఇవ్వనున్నారు.
వాడిపాడేసిన సెల్ఫోన్లు, ఇతర చిన్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల నుంచి తీసిన బంగారం, వెండి, కంచుతో ఈ పతకాలకు రూపమిచ్చారు. దాదాపు 79 వేల టన్నులకు పైగా పునర్వినియోగ ఎలక్ట్రానిక్ చెత్తను జపాన్ ప్రజల నుంచి సేకరించిన టోక్యో నిర్వాహకులు పతకాలను తయారు చేశారు.
1896 ఏథెన్స్ ఒలింపిక్స్ నుంచే విజేతలకు పతకాలు అందించడం మొదలైంది. విజేతలకు రజతం, రన్నరప్‌గా నిలిచిన వాళ్లకు రాగి లేదా కాంస్య పతకం ఇచ్చేవాళ్లు.
1904లో తొలిసారిగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను ఉపయోగించారు. గ్రీకు పురాణాల ప్రకారం ఈ మూడు పతకాలు మూడు తరాలకు ప్రతీకలుగా భావిస్తారు.