Surya Photo Gallery : 'బాల' సూర్య భలే ఉన్నాడుగా.. ముద్దుముద్దుగా!
ఈ తరం హీరోల్లో సూర్యకు మంచి క్రేజ్ ఉంది. ప్రముఖ సినీ నటుడు శివ కుమార్ పెద్ద కుమారుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సూర్య స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు. కోలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఆయన నటించే తమిళ సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. ఈ క్రమంలో 'గజినీ', 'సింగం' లాంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. ఈరోజు సూర్య తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలు మీకోసం!
సూర్య చిన్నప్పటి రేర్ ఫోటో
తన తండ్రి శివకుమార్, తమ్ముడు కార్తీలతో సూర్య అరుదైన ఫోటో
హీరో విజయ్ తో కలిసి సూర్య చిన్నతనంలో తీసిన ఫోటో.. ఇందులో శివకుమార్ కూడా ఉన్నారు.
టీనేజ్ వయసులో సూర్య
సూర్య నటించిన 'సుందరాంగుడు' సినిమాలో గూనివాడిగా కనిపించి ఆశ్చర్యపరిచాడు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలిసి 'రక్తచరిత్ర' సినిమా చేస్తోన్న సమయంలో తీసుకున్న వర్కింగ్ స్టిల్
హాలీవుడ్ యాక్షన్ హీరో ఆర్నాల్డ్ తో సూర్య
జ్యోతికతో సూర్య రేర్ ఫోటో.. వీరిద్దరూ కలిసి చాలా సినిమాలు చేశారు. ఆ తరువాత ఒకరిపై మరొకరికి ప్రేమ కలగడంతో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.
తన భార్యా బిడ్డలతో సూర్య అరుదైన పిక్
సూర్య ఫ్యామిలీ ఫోటో