FIFA World Cup 2022: మెస్సీ జట్టు కొట్టేస్తుందా మూడో కప్పు! అర్జెంటీనా స్పెషల్ ఏంటో తెలుసా!

అర్జెంటీనా అద్భుతం చేసింది. ఫిఫా 2022 ప్రపంచకప్ ఫైనల్ చేరుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
కెరీర్లో ఒక్కసారైనా ప్రపంచకప్ ముద్దాడాలన్న తన కలకు మెస్సీ మరింత దగ్గరయ్యాడు.

ఫిఫాలో అర్జెంటీనా ఎప్పటికీ బలమైన పోటీదారే! గొప్ప ఆటగాళ్లను అందించింది.
డిగో మారడోనా, లయోనల్ మెస్సీ, గ్యాబ్రియేల్ బటిస్టుటా, ఏంజెల్ డి మారియా, సెర్జియో అగెరో అర్జెంటీనా నుంచే వచ్చారు.
1978, 1986 ప్రపంచకప్‌లను అర్జెంటీనా గెలిచింది. 1930, 1990, 2014లో రన్నరప్‌గా నిలిచింది.
ప్రపంచకప్‌లో ఈ దేశం 81 మ్యాచులాడింది. 43 గెలుపు, 15 డ్రా, 23 ఓటములతో నిలిచింది. 137 గోల్స్ చేసింది.
కోపా అమెరికాలో అర్జెంటీనాకు తిరుగులేదు. 15సార్లు కప్ కొట్టింది. 14 సార్లు రన్నరప్‌గా నిలిచింది.
1928 ఒలింపిక్స్‌లో అర్జెంటీనా రెండో ప్లేసులో నిలిచి సిల్వర్ మెడల్ విన్నైంది.
అర్జెంటీనా తరఫున మెస్సీ (96), బటిస్టుటా (56), ఆగ్వెరో (41), హెర్నాన్ క్రెస్పో (35), డిగో మారడోనా (34) టాప్ స్కోరర్లు.
2022 ఫైనల్లో ఫ్రాన్స్ లేదా మొరాకోతో అర్జెంటీనా తలపడనుంది. డిసెంబర్ 18 ఇందుకు వేదిక.