WTC Final: లండన్‌లో అడుగుపెట్టిన 'కింగ్'.. తోడుగా నయావాల్!
టీమ్ఇండియా జూన్ 7 నుంచి 11 వరకు ఓవల్ మైదానంలో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడనుంది. అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఐపీఎల్ వల్ల బీసీసీఐ ఆటగాళ్లను బ్యాచులు బ్యాచులుగా లండన్‌కు పంపిస్తోంది. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడటం ఇది రెండోసారి. అరంగేట్రం ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి చవిచూసింది.
టీమ్ఇండియా ఇప్పటికే 15 మందితో కూడిన ప్రధాన జట్టును ప్రకటించింది. ముగ్గురు స్టాండ్ బై ఆటగాళ్లను తీసుకొంది.
ఫైనల్ మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ, చెతేశ్వర్ పుజారా, జయదేవ్ ఉనద్కత్, శార్దూల్ ఠాకూర్ లండన్‌లో అడుగు పెట్టారు. కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని కోచింగ్ స్టాఫ్ తోడుగా ఉంది.
కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వీ జైశ్వాల్, రవీంద్ర జడేజా, శుభ్ మన్ గిల్ వంటి ఆటగాళ్లు మిగతా బ్యాచులో లండన్ వస్తారు.
ఈసారి ఎలాగైనా ప్రపంచ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకోవాలని టీమ్ ఇండియా పట్టుదలగా ఉంది.