Amelia Kerr MI: ముంబయి ఆల్‌రౌండర్ అమెలియా కెర్ బ్యూటిఫుల్ పిక్స్! ఆ ఫొటో మాత్రం..!
విమెన్ ప్రీమియర్ లీగులో ఒక మ్యాచ్ ముగిసిందో లేదో తమ క్రష్ లిస్ట్ అప్డేట్ అయిందంటున్నారు కుర్రాళ్లు! ముంబయి ఇండియన్స్ ఆల్‌రౌండర్ అమెలియా కెర్‌తో (Amelia Kerr) ప్రేమలో పడిపోయాం అంటున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appముంబయి విజయంలో ఆమె బ్యాటు, బంతితో కీలక పాత్ర పోషించింది.
మిడిలార్డర్లో క్రీజులోకి వచ్చిన అమెలియా కెర్ ఆరంభం నుంచీ దూకుడుగా ఆడింది. 24 బంతుల్లో 6 బౌండరీలు, ఒక సిక్సర్ బాదేసి 45 పరుగులు చేసింది. 187 స్ట్రైక్‌రేట్‌తో రెచ్చిపోయింది.
ఆ తర్వాత బంతితోనూ అదరగొట్టింది. గింగిరాలు తిప్పే బంతులతో ప్రత్యర్థిని బెదరగొట్టింది. 2 ఓవర్లు వేసి కేవలం 12 పరుగులు ఇచ్చింది. 2 వికెట్లు పడగొట్టింది. ఇందులో ఒక మెయిడిన్ ఓవర్ ఉండటం ప్రత్యేకం. ఈ రెండు వికెట్లూ ఒకే ఓవర్లో పడ్డాయి.
మ్యాచ్ ముగిసిన తర్వాత అమెలియా కెర్‌తో ప్రేమలో పడిపోయామని చాలామంది కుర్రాళ్లు అంటున్నారు. ఆమె అందం తమను ఉక్కిరి బిక్కిరి చేస్తోందని చెబుతున్నారు. ఆమె చిరు నవ్వులు చిందిస్తున్న చిత్రాలను ట్విటర్లో ట్రెండింగ్ చేస్తున్నారు.