India's Lowest Innings: సొంతగడ్డపై టీమ్ఇండియా విలవిల స్కోర్లు! 90 దాటలేదు!
సొంతగడ్డపై టీమ్ఇండియాకు తిరుగులేదు. సుదీర్ఘ ఫార్మాట్లోనైతే ప్రత్యర్థిని అల్లాడించేస్తారు. తక్కువ స్కోర్లకే ఆలౌట్ చేస్తారు. కొన్ని సార్లు తమ గోతిలో తామే పడ్డ సందర్భాలూ లేకపోలేదు. ఇండోర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హిట్‌మ్యాన్ సేన 109కే చాపచుట్టేసింది. గతంలోనూ ఇలా జరిగిన సందర్భాలున్నాయి!
Download ABP Live App and Watch All Latest Videos
View In App1987లో టీమ్ఇండియా దిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో తలపడింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో 30.5 ఓవర్లకే 75 పరుగులకు ఆలౌటైంది. అరుణ్ లాల్ (20), కిరణ్ మోరె (12 నాటౌట్) టాప్ స్కోరర్లు.
2008లో అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికా చేతుల్లో భంగపాటు తప్పలేదు. తొలి ఇన్నింగ్సులో 20 ఓవర్లకే 76కు బ్యాట్లెత్తేసింది. ఎంఎస్ ధోనీ (14), ఇర్ఫాన్ పఠాన్ (21) టాప్ స్కోరర్లు. డేల్ స్టెయిన్ (5), మఖాయా ఎన్తిని (3) చుక్కలు చూపించారు.
1977లో చెన్నైలో మరో పరాభవం ఎదురైంది. ఆఖరి ఇన్నింగ్సులో ఇంగ్లాండ్ 38.5 ఓవర్లకే 83 పరుగులకే టీమ్ఇండియాను ఆలౌట్ చేసింది. సునీల్ గావస్కర్ (24) టాప్ స్కోరర్. బాబ్ విలిస్ (3), డెరెక్ అండర్వుడ్ (4) చురకత్తుల్లాంటి బంతులేశారు.
1999లోనూ మొహాలిలో న్యూజిలాండ్ చేతుల్లో అవమానం ఎదురైంది. తొలి ఇన్నింగ్సులో 27 ఓవర్లకే 83 స్కోరుకు పరిమితమైంది. సచిన్ (18), మన్నవ్ ప్రసాద్ (16) టాప్ స్కోరర్లు. డియాన్ నాష్ (6) చుక్కలు చూపించాడు.
1965లో బ్రబౌర్న్ వేదికగా న్యూజిలాండ్, భారత్ తలపడ్డాయి. రెండో ఇన్నింగ్సులో టీమ్ఇండియా 33.3 ఓవర్లకు 88కే చేతులెత్తేసింది. చందూబోర్డె (25), ఫరూఖ్ ఇంజినీర్ (17) టాప్ స్కోరర్లు. బ్రూస్ టేలర్ (5) చెలరేగాడు.