ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లు తెలుసు! మరి వారి ప్రేమ కధలు తెలుసా మీకు?
దక్షిణాఫ్రికా టీ20 జట్టుకు ఐడెన్ మార్క్రామ్ కెప్టెన్ అన్న విషయం తెలిసిందే. అతను స్కూల్ లో రగ్బీ ఆడే సమయంలో నికోల్ డానియెల్లా ఓ'కానర్ ని మొదటిసారి కలిశాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమార్క్రామ్ ,నికోల్ లు సుమారు 10 సంవత్సరాల డేటింగ్ తరువాత 22 జూలై 2023న వివాహం చేసుకున్నారు. నికోల్ ఒక ప్రొఫెషనల్ మోడల్.
భారత టెస్టు, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తొలిసారిగా 2008లో రితికా సజ్దేను కలిశాడు. రితికా స్పోర్ట్స్ ఈవెంట్ మేనేజర్‌గా ఉన్న ఒక యాడ్ షూట్లో ఇద్దరూ మీట్ అయ్యారు.
సుమారు 7 సంవత్సరాల తరువాత రితికా, రోహిత్ లు 13 డిసెంబర్ 2015న వివాహం చేసుకున్నారు. వీరికి 2022లో సమైరా అనే కుమార్తె కలిగింది.
ఆస్ట్రేలియా జట్టుకు టెస్టు, వన్డే కెప్టెన్ గా పాట్ కమిన్స్ వ్యవహరిస్తున్నాడు. అతని భార్య పేరు బెకీ బోస్టన్ . ఇద్దరూ 2013లో తొలిసారి కలుసుకున్నారు.
పదేళ్ళ పాటు డేటింగ్ చేసిన తర్వాత ఆగష్టు 1, 2022న బెకీ బోస్టన్‌ను కమిన్స్ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.