Kamindu Mendis: ఒక సెంచరీ !ఐదు రికార్డులు -బ్రాడ్‌మన్ సరసన శ్రీలంక యువ క్రికెటర్
శ్రీలంక యువ క్రికెటర్ కమిందు మెండిస్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గాలే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న మొదటి టెస్టులో శతకం బాదిన కమిందు ఒకేసారి ఐదు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపాతికేళ్ల కమిందు మెండిస్ ఇప్పటివరకు ఆడింది ఏడు టెస్టు మ్యాచులు. మొత్తం 11 ఇన్నింగ్స్‌లలో కలిపి చేసినవి 809 పరుగులు. బ్యాటింగ్ సగటు 80.90.
కమిందు ఆడిన ఏడు టెస్టుల్లో అంటే ప్రతి మ్యాచ్‌లోనూ ఒక్క అర్ధ శతకం అయినా బాదాడు. ఇలా ప్రతి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన తొలి శ్రీలంక క్రికెటర్ అతడే.
శ్రీలంక బ్యాటర్ మెండిస్ 11 ఇన్నింగ్స్‌లో నాలుగు సెంచరీలు నమోదు చేశాడు. క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ కూడా తన మొదటి నాలుగు సెంచరీలను 11 ఇన్నింగ్స్‌లలోనే సాధించాడు. దీంతో కమిందు మెండిస్ బ్రాడ్‌మన్ సరసన చేరాడు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సీజన్లో కనీసం 10 ఇన్నింగ్స్ కన్నా ఎక్కువగా ఆడిన బ్యాటర్లలో కమిందు మెండిస్‌దే అత్యుత్తమ సగటు. ప్రస్తుతం కమిందు సగటు 80.90 . న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ ను మెండిస్ దాటేశాడు.
ఒకే డబ్ల్యూటీసీ సీజన్లో ఎక్కువ శతకాలు బాదిన ఆటగాడిగా ఇప్పటివరకు లంక బ్యాటర్ దిముత్ కరుణరత్నెరికార్డులలో ఉన్నాడు. ఇప్పుడు మెండిస్ అతడితో సమంగా నిలిచాడు.
2022లో టెస్టు కెరీర్‌ను ప్రారంభించిన మెండిస్ తొలి మ్యాచ్‌లో 61 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. 2024లో టెస్టు ఆడే అవకాశం దక్కించుకున్న మెండిస్ బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ సాధించాడు.
బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ వంటి బలమైన జట్లపై మెండిస్ టెస్టు సెంచరీలు సాధించాడు.