ఐపీఎల్ 2025 మెగా వేలం! వీరిపై కాసుల వర్షం ఖాయమా ?
భారత బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్..ఈసారి నిర్వహించే మెగా వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంది. 2024 ఐపీఎల్లో సర్ఫరాజ్ రూ. 20 లక్షల బేస్ ధరకు వేలంలోకి వచ్చాడు. అయితే అతడిని ఏ జట్టు కూడా కొనుగోలు చేయలేదు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈసారి ఐపీఎల్ 2025 మెగా వేలంలో సర్ఫరాజ్ ఖాన్ పై కాసుల వర్షం కురుస్తుందని అంచనా వేస్తున్నారు.
ఐపీఎల్ 2024లో అమ్ముడుపోకుండా నిలిచిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ 2025 IPL మెగా వేలంలో భారీ ధర పలుకుతాడని భావిస్తున్నారు. 2024 మేజర్ లీగ్ T20లో తన జట్టును స్మిత్ విజేతగా నిలిపాడు.
కెప్టెన్సీతో పాటు బ్యాట్‌తోనూ స్మిత్ అద్భుత ప్రదర్శన చేయడంతో ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో స్మిత్ కోసం ప్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది. ఆ టోర్నమెంట్లో స్మిత్ 9 మ్యాచ్‌లలో56.00 సగటుతో 336 పరుగులు చేశాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
జోష్ ఇంగ్లిష్ ఆస్ట్రేలియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ జోష్ ఇంగ్లిస్ కూడా IPL 2024లో అమ్ముడు పోలేదు. రూ.2 కోట్ల బేస్ ధరతో వేలంలోకి వచిన ఇంగ్లిష్ ను ప్రాంచైజీలు పట్టించుకోలేదు. అయితే ఈసారి ఇంగ్లిష్ కోసం భారీగా ఖర్చు పెట్టేందుకు ప్రాంచైజీలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంచి వికెట్ కీపర్ కావడం.. భారీ షాట్లు ఆడగలగడం ఇంగ్లిష్ కు కలిసిరానుంది.
ఐపీఎల్ 2024లో దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్ తబ్రేజ్ షమ్సీని ఏ జట్టు కొనుగోలు చేయలేదు. బేస్ ధర రూ.50 లక్షలతో షంసీ వేలంలోకి వచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. అయితే, ఈసారి అతనికి మంచి బిడ్ దక్కే అవకాశం ఉంది. షంసీ టీ 20 ప్రపంచకప్ లో మెరుగ్గా రాణించాడు. కాబట్టి ఈసారి భారీ ధర పలికే అవకాశం ఉంది.