Rohit Sharma: కెప్టెన్ ఫోటోషూట్‌లో T20 ప్రపంచ కప్ ట్రోఫీతో రోహిత్ శర్మ
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీమ్ఇండియా టీ 20 ప్రపంచ కప్ గెలుచుకుంది. ఓటమి తప్పదని భావించిన క్షణంలో రోహిత్ సేన అద్భుతం చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఓటమి అంచులకు చేరుకున్నామనుకున్న క్షణంలోనే రోహిత్ నేతృత్వం లోని జట్టు సభ్యుల సమిష్టి కృషితో ట్రోఫీని దక్కించుకుంది.
భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. నేలపై పడి ఆనందాన్ని ప్రదర్శించాడు. కన్నీరుమున్నీరయ్యాడు.
తమ జట్టుకు అద్భుత ట్రోఫీని అందించిన బార్బడోస్ పిచ్ మట్టిని తిన్నాడు. ఆ నేలకు గౌరవాన్నిచ్చాడు.
గుండె నిండా ఆనందోత్సాహంతో, భుజాలపై కుమార్తెను ఎత్తుకొని గ్రౌండ్ లో తృప్తిగా తిరిగాడు.
అదే ఆనందంతో పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో తన టీ 20 ఫార్మాట్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆటకు వీడ్కోలు పలకటానికి ఇంతకన్నా మంచి సమయం లేదన్నాడు.
అనితర సాధ్యం రోహిత్ ప్రయాణం. జట్టు సారాధిగా 5 ఐపిఎల్ ట్రోఫీలు, ఛాంపియన్స్ లీగ్ టీ 20 ట్రోఫీ, నిదహాస్ ట్రోఫీ తాజాగా టీ 20 ప్రపంచ కప్ అందించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.