Rahul Dravid: విశ్వవిజేతలకు గురువుగా రాహుల్ విజయ గర్జన
టీ 20 ప్రపంచకప్ ను అందుకున్న రాహుల్ ద్రావిడ్ విజయగర్జన చేశాడు. ఈ అపురూప క్షణం కోసమే కదా ఇన్ని సంవత్సరాలుగా శ్రమ పడ్డది అన్న అన్న ఆనందంలో భావోద్వేగానికి గురయ్యాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆటకు వీడ్కోలు చెప్పిన తర్వాత రాహుల్ 2021లో టీమ్ ఇండియా కు కోచ్ గా మారాడు. అయితే అప్పుటికే యుఏఈ వేదికగా టీ20 వరల్డ్ కప్ ముగిసిపోయింది.
మొట్టమొదటిగా న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌తో తన మార్క్ చూపించాడు ద్రావిడ్. అప్పటి నుంచి టీం ఇండియా వెనుదిరిగి చూసుకునే అవసరం లేకుండా జట్టును అన్నివిధాలా రాటుదేల్చాడు.
2007 మార్చిలో ఇదే వెస్టిండీస్ లో జరిగిన వన్డే ప్రపంచకప్ లో దిగ్గజాలతో కూడిన టీమ్‌ఇండియా ఘోరంగా విఫలం అయ్యింది. బంగ్లాదేశ్ చేతిలో పరాభవం పొందింది.
ఇప్పుడు 17 ఏళ్ల తరువాత పోగొట్టుకున్న చోటే దొరకబెట్టింది అన్నట్టు టీం ఇండియా విజయ భేరి మోగించింది. ఆ నాడు కెప్టెన్ గా పొందలేకపోయిన ఆనందాన్ని ఈనాడు కోచ్ గా పొందాడు రాహుల్ ద్రావిడ్.
రాహుల్ ద్రావిడ్ కోచ్ గా ఉన్న మూడేండ్ల కాలంలో రోహిత్ శర్మ కెప్టెన్ గా భారత జట్టు అద్భుతాలు చేసింది. 2023 టెస్టు చాంపియన్‌షిప్, 2023 వన్డే వరల్డ్ కప్, 2024 టీ20 వరల్డ్ కప్ వంటి ఐసీసీ టోర్నీలలో ఫైనల్ చేరగా 2022 టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ దాకా వెళ్లింది. ఇప్పుడు టీ 20 ప్రపంచ కప్ ను సాధించి విశ్వ విజేతగా నిలచింది.
వాస్తవానికి ఐసిసి వన్డే ప్రపంచకప్ తోనే ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. అయితే బీసీసీఐ ప్రత్యేకంగా దానిని టీ20 వరల్డ్‌కప్ వరకు పొడిగించింది. మొత్తానికి కోచ్‌గా తన ప్రయాణాన్ని ద్రవిడ్ విజయంతో ముగించాడు.