Womens T20 World Cup: ఒకే మ్యాచులో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాళ్లు వీళ్ళే
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ 2014 ఎడిషన్‌లో ఐర్లాండ్‌పై 193.84 స్ట్రైక్ రేట్‌తో 65 బంతుల్లో 126 పరుగులు చేసింది. ఓ ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటికీ లానింగ్ పేరు మీదే ఉంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవెస్టిండీస్ బ్యాటర్ డియాండ్రా డాటిన్ 2010లో 248.88 స్ట్రైక్ రేట్‌తో 45 బంతుల్లో 112 పరుగులతో అజేయంగా నిలిచింది. అత్యధిక వ్యక్తిగత పరుగుల జాబితాలో డాటిన్ రెండో స్థానంలో ఉంది.
టీ 20 ప్రపంచకప్ 2020 ఎడిషన్‌లో హీథర్ నైట సూపర్ సెంచరీతో మెరిసింది. హీథర్ 163.63 స్ట్రైక్ రేట్‌తో 66 బంతుల్లో 108 పరుగుల అజేయంగా నిలిచింది. ఈ జాబితాలో హీథర్ మూడో స్థానంలో ఉంది.
భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 2018 ఎడిషన్‌లో 201.96 స్ట్రైక్ రేట్‌తో 51 బంతుల్లో 103 పరుగులు చేసింది. ఆమె జాబితాలో నాల్గవ స్థానంలో ఉంది. హర్మన్ భారత తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచింది.
మునీబా అలీ 2023 టీ 20 ప్రపంచకప్ ఎడిషన్‌లో 68 బంతుల్లో 150 స్ట్రైక్ రేట్‌తో 102 పరుగుల చేసింది. మహిళల T20 ప్రపంచ కప్‌లో ఐదవ అత్యధిక వ్యక్తిగత స్కోరును కలిగి ఉంది.