Photos: బీసీసీఐ నుంచి ఏడాదికి భారత క్రికెటర్లకు ఎంత డబ్బు వస్తుందంటే ?
ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. కోహ్లీ నికర ఆస్తుల విలువ రూ. 1,000 కోట్ల కంటేపైనే. బీసీసీఐ నుంచి కూడా కోహ్లీ సంపాదన కోట్లలో ఉంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2024లో విడుదల చేసిన బీసీసీఐ కాంట్రాక్ట్ జాబితాలో విరాట్ కోహ్లీ ఏ ప్లస్ కేటగిరీ ఉన్నాడు. ఏ-ప్లస్ కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు బీసీసీఐ ఏటా రూ.7 కోట్ల జీతం ఇస్తుంది.
టీమిండియా సారధి రోహిత్ కూడా ఏ-ప్లస్ కేటగిరీలో ఉన్నాడు. దీంతో హిట్ మ్యాన్‌కు కూడా ఏటా రూ. 7 కోట్ల వార్షిక వేతనం వస్తుంది. రోహిత్ ప్రస్తుతం భారత టెస్టు, వన్డే జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.
'యార్కర్ కింగ్'గా కూడా ప్రసిద్ధి చెందిన బుమ్రా కూడా ఏ ప్లస్ కేటగిరిలోనే ఉన్నాడు. అతని జీతం కూడా ఏటా రూ.7 కోట్లు. ఈ ఏడాది భారత్ తరఫున అత్యధిక వికెట్లు (42) తీసిన బౌలర్‌గా కూడా బుమ్రా నిలిచాడు.
రవీంద్ర జడేజా బీసీసీఐ ఏ-ప్లస్ విభాగంలో చేర్చిన నాలుగో ఆటగాడు రవీంద్ర జడేజా. జడేజా తన అంతర్జాతీయ కెరీర్లో 6 వేలకు పైగా పరుగులు, 560కి పైగా వికెట్లు తీశాడు. జడేజాకు కూడా ఏటా రూ. 7 కోట్ల ఆదాయం బీసీసీఐ నుంచి లభిస్తుంది.
ఇక హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్ సహా ఆరుగురు ఆటగాళ్లను బీసీసీఐ ఏ కేటగిరీలో ఉంచింది. వీరికి ఏడాదికి రూ. 5 కోట్ల ఆదాయం వస్తుంది.