Jasprit Bumrah: టీ 20 ప్రపంచ కప్ లో ప్రత్యర్ధులను బెంబేలెత్తించిన బూమ్ బూమ్ బుమ్రా
సాధారణంగా టీ 20 ఆట బ్యాటర్ లది. కానీ ఈసారి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు మాత్రం ఒక బౌలర్ దక్కించుకున్నాడు. అతనే టీమ్ ఇండియా బౌలర్ జస్ప్రిత్ బుమ్రా.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబుమ్రా టీమిండియాలో ఉండడం అదృష్టమని చెబుతారు జట్టు సభ్యులు. ఎందుకంటే కష్టం లో ఉన్న ప్రతిసారీ బరిలో దిగి మ్యాజిక్ చేశాడు బుమ్రా . వికెట్టు కావాలని కోరుకున్న క్షణంలో వికెట్ తీసేస్తాడు.
ఈ పొట్టి ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యంత పొదుపైన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. ఇతని ఎకానమీ 4.17. అందుకే టీ 20 చరిత్రలో ఇప్పటివరకు చూడని గొప్ప బౌలర్ బుమ్రా అని స్వయంగా ఐసీసీ కొనియాడింది.
తోటి ఆటగాళ్ళు ప్రశంసించడమే కాదు. 1983లో భారత్‌కు తొలి ప్రపంచకప్‌ను అందించిన హర్యాణా హరికేన్ కపిల్‌దేవ్ కూడా బుమ్రా బౌలింగ్ కి ఫిదా అయిపోయాడు. అతను తనకంటే వెయ్యి రేట్లు ఉత్తమ బౌలర్ అంటూ కితాబిచ్చాడు.
షార్ట్ రనప్‌తో బుమ్రా బౌలింగ్ యాక్షన్ చాలా విభిన్నంగా ఉంటుంది. అయినా సరే అతని బౌలింగ్ యాక్షన్ మార్చేందుకు ఇప్పటి వరకు ఎవరూ యత్నించలేదు. కోచ్ గానీ, తోటి ఆటగాళ్ళు గానీ అతనికి ఒక సలహా కూడా ఇవ్వరు. అతడి వ్యూహం ప్రకారమే ఆడే స్వేచ్చ నిస్తారు.
జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేశన్ యాంకర్. వారికి అంగద్ అనే కుమారుడు ఉన్నాడు. టీ 20 ప్రపంచ కప్ ను అంగద్ ముందు సాధించడం తనకు మరింత ఆనందాన్ని ఇచ్చిందని చెప్పాడు బుమ్రా.