Pujara Test Record: బ్రాడ్మన్ రికార్డు బద్దలు కొట్టేందుకు సిద్ధమైన పుజారా!
టీమ్ఇండియా నయావాల్ చెతేశ్వర్ పుజారా అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. ఆస్ట్రేలియా లెజెండ్ డాన్ బ్రాడ్మన్ రికార్డును బద్దలు కొట్టనున్నాడు. బంగ్లాదేశ్తో రెండో టెస్టులో మరో 12 పరుగులు చేస్తే చాలు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబ్రాడ్మన్ 52 టెస్టుల్లో 99.94 సగటుతో 6,996 పరుగులు సాధించాడు. ఈ రికార్డుకు పుజారా 12 రన్స్ దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకు 97 టెస్టుల్లో 44.76 సగటుతో 6984 పరుగులు చేశాడు.
చెతేశ్వర్ పుజారా 2010లో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. బెంగళూరులో ఆస్ట్రేలియాపై తొలి టెస్టు ఆడాడు. అప్పట్నుంచి సుదీర్ఘ ఫార్మాట్లో కీలకంగా మారాడు. నిలకడగా పరుగులు చేస్తూ నయావాల్గా అవతరించాడు.
టెస్టుల్లో 19 సెంచరీలు చేసిన పుజారా దిగ్గజ క్రికెటర్లైన రాస్ టేలర్ (న్యూజిలాండ్), గార్డన్ గ్రీనిడ్జ్ (వెస్టిండీస్), క్లైవ్ లాయిడ్ (వెస్టిండీస్), మైక్ హస్సీ (ఆస్ట్రేలియా) సరసన నిలిచాడు.
టీమ్ఇండియా తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో పుజారా ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, వీవీఎస్ లక్ష్మణ్, సునిల్ గావస్కర్, రాహుల్ ద్రవిడ్, సచిన్ తెందూల్కర్ అతడికన్నా ముందున్నారు.