Pujara Test Century: పూజలు ఫలించాయ్! 51 ఇన్నింగ్సుల తర్వాత పుజారా సెంచరీ
Pujara Test Century: టీమ్ఇండియా నయావాల్ చెతేశ్వర్ పుజారా మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో పరుగుల వరద పారించాడు. రెండు ఇన్నింగ్సుల్లో కలిపి 192 పరుగులు చేశాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPujara Test Century: తొలి ఇన్నింగ్సులో పుజారా సెంచరీ మిస్ చేసుకున్నాడు. 203 బంతులాడి 11 బౌండరీలతో 90 కొట్టాడు. రెండో ఇన్నింగ్సులో కరవు తీర్చుకున్నాడు. 130 బంతుల్లో 13 బౌండరీల సాయంతో 102* పరుగులు చేశాడు.
Pujara Test Century: అంతర్జాతీయ క్రికెట్లో 51 ఇన్నింగ్సుల తర్వాత పుజారా సెంచరీ కొట్టడం గమనార్హం. చాలా కాలంగా అతడు టీమ్ఇండియా తరఫున శతకాలు నమోదు చేయలేదు. ఆశించిన రీతిలో రన్స్ సాధించలేదు.
Pujara Test Century: పుజారా చివరి సారిగా 2019, జనవరిలో సెంచరీ కొట్టాడు. సిడ్నీలో ఆసీస్‌పై 373 బంతుల్లో 193 సాధించాడు. ఆ తర్వాత సెంచరీ కొట్టడం ఇదే తొలిసారి. 2020లో 4; 2021లో 14 టెస్టులు ఆడినా మూడంకెల స్కోరు అందుకోలేదు.
Pujara Test Century: టెస్టు మ్యాచులు లేకపోవడం, ఫామ్ కోల్పోవడంతో పుజారా లైమ్ లైట్లో లేడు. ఐపీఎల్లో ఎవరూ తీసుకోకపోవడంతో ఇంగ్లాండ్ వెళ్లి కౌంటీ క్రికెట్ ఆడాడు. ససెక్స్ జట్టు తరఫున రన్ ఫెస్ట్ సృష్టించాడు. సెంచరీలు, డబుల్ సెంచరీలతో మోత మోగించాడు.