Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Ind vs Aus Final 2023: దారులన్నీ అహ్మదాబాద్ వైపే - కుంభమేళాను తలపిస్తోన క్రికెట్ స్టేడియం పరిసరాలు
వరల్డ్ కప్ ఫైనల్ కోసం భారీగా తరలి వస్తున్న ఫ్యాన్స్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకిక్కిరిసిపోయిన నరేంద్రమోదీ స్టేడియం
గ్రౌండ్‌కు చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు
సెలబ్రెటీల రాకతో సందడి వాతావరణం
మూడోసారి విశ్వవిజేతగా నిలవాలని ఫ్యాన్స్ కోరిక
భారత్ మూడోసారి విశ్వవిజేతగా నిలిస్తే చూడాలని తరలి వచ్చిన అభిమానులు
టీమిండియా జెర్సీలతో స్టేడియం బయట జనసునామీ కనిపిస్తోంది.
ఎటు చూసినా భారత్ విజయంసాధించాలని నినాదాలతో ఫ్యాన్స్ సందడి సందడి చేస్తున్నారు.
ఇటు సెలబ్రెటీలు, సినీ రాజకీయ ప్రముఖుల రాకతో నరేంద్రమోదీ స్టేడియం కుంభమేళాను తలపిస్తోంది.
ప్రపంచకప్‌లో మహా సంగ్రామానికి టీమిండియా(Team India) సిద్ధమైంది.
సూపర్ సండే రోజున అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా(Austrelia)తో భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది.
టీమిండియా విజయం కోసం 130 కోట్ల మంది ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
2011 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యులైన విరాట్ కోహ్లి, అశ్విన్ మరోసారి ఆ అనుభూతిని పొందాలని పట్టుదలతో ఉన్నారు
ఏమాత్రం ఎమరుపాటు లేకుండా.. ముచ్చటగా మూడోసారి కప్పును గెలిచేందుకు రోహిత్ సేన సిద్ధంగా ఉంది.
ప్రతిష్టాత్మక లార్డ్స్ స్టేడియంలో 1983లో కపిల్ దేవ్ కప్పును ఎత్తిన క్షణాలను... 2011లో ధోని సిక్సు కొట్టి గెలిపించిన అనుభూతులను మరోసారి కళ్లారా వీక్షించాలని క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్ తుది పోరులో ఆస్ట్రేలియాను మట్టికరిపించి టీమిండియా విజయం సాధించాలని.. కోట్లమంది క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.
ఒత్తేడే ప్రధాన శత్రువుగా టీమిండియా బరిలోకి దిగుతోంది. తమ దృష్టంతా ఆటపైనే ఉంటుందని ఒత్తిడి తమపై ఎప్పుడూ ఉండేదేనని రోహిత్ శర్మ ఇప్పటికే స్పష్టం చేశాడు.
అప్రతిహాతంగా పది విజయాలతో ఫైనల్ చేరిన టీమిండియా...11 వ మ్యాచ్‌లోనూ గెలిచి ఓటమే లేకుండా ప్రపంచకప్ గెలవాలని పట్టుదలగా ఉంది.
రోహిత్‌తో సహా క్రికెటర్లందరూ తమ కెరీర్లోనే అత్యంత కీలకమైన మ్యాచ్‌ను ఆడేందుకు సిద్ధమయ్యారు.
భారత్ బ్యాటింగ్‌లో చాలా బలంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ 550 పరుగులతో దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నారు.
90 సగటుతో విరాట్ కోహ్లి 711 పరుగులు చేసి ఈ ప్రపంచకప్‌లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ సెమీఫైనల్లో సెంచరీ చేసి మంచి టచ్‌లో ఉన్నాడు.
రాహుల్ కూడా విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. గిల్, జడేజాలు కూడా ఫామ్‌లో ఉన్నారు. KL రాహుల్ ప్రశాంతత, రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ నైపుణ్యం టీమిండియాకు అదనపు బలంగా మారాయి.