Team India Wild Life Tour: జింబాబ్వేలో వైల్డ్ లైఫ్ టూర్ తో రిలాక్స్ అవుతున్న టీమిండియా ఆటగాళ్లు

భారత యువ ఆటగాళ్లు జింబాబ్వేలో అడవుల్లో వన్య ప్రాణుల మధ్య సేద తీరారు. కోచ్ వీవీఎస్ లక్ష్మణ్, సారధి శుభ్మన్ గిల్ సహా ఆటగాళ్లందరూ జింబాబ్వే టూరిజం ఏర్పాటు చేసిన వైల్డ్ లైఫ్ టూర్లో సందడి చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
చాలా దగ్గరగా వన్యప్రాణులను చూసిన క్రికెటర్లు ఆశ్చర్యపోయారు. భారీ ఆకారంలో ఉన్న ఏనుగులు, జిరాఫీలు, దుప్పిలను చూసి క్రికెటర్లు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.

క్రికెటర్లకు, వారి కుటుంబ సభ్యులకు గైడ్లు అక్కడి జంతువుల ప్రత్యేకతలను వివరించారు.
జింబాబ్వేతో అయిదు టీ 20 మ్యాచ్ల సిరీస్లో ఇప్పటివరకూ రెండు మ్యాచులు జరగగా రెండు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమంగా నిలిచాయి. మూడో మ్యాచ్ రేపు జరగనుంది.
రెండో టీ 20 మ్యాచ్కు మూడో మ్యాచ్కు విరామం రావడంతో... భారత ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యుల కోసం బీసీసీఐ... జింబాబ్వే క్రికెట్ బోర్డు, పర్యాటక శాఖ ఈ వైల్డ్ లైఫ్ టూర్ ఏర్పాటు చేశారు. క్రికెటర్ల ఫొటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దొరికిన చిన్న విరామం లోను టీమిండియా ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులు ఆట విడుపు కోసం స్థానిక అభయారణ్యాలను సందర్శించి ఆనందించారు.