రిషబ్ పంత్ కంటే ఘోర ప్రమాదం, నికోలస్ పూరన్ ఆక్సిడెంట్ గురించి తెలుసా మీకు
భారత ఆటగాడు రిషబ్ పంత్ లాగానే, వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ కూడా కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రపంచంలోని బలమైన బ్యాట్స్మెన్లలో నికోలస్ పూరన్ ఒకరు. అద్భుతమైన సిక్సర్లు కొట్టడంలో పేరున్న నికోలస్ కొన్నేళ్ల క్రితం ఘోర ప్రమాదానికి గురయ్యాడు.
నిజానికి 2015 జనవరిలో ట్రినిడాడ్‌లో జరిగిన కారు ప్రమాదంలో 19 ఏళ్ల పూరన్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో అతని రెండు కాళ్లు విరిగిపోయాయి. ఈ ప్రమాదం తర్వాత.. అతను క్రికెట్‌ను వదులుకోవాలని.. అప్పుడే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్ సలహా ఇచ్చాడు.
పూరన్ కాలు నిటారుగా లేకపోవడంతో సుమారు 18 నెలలు వీల్ చైర్ సాయం తీసుకోవాల్సి వచ్చింది. లేచి నిలబడటం కోసం 6 నెలల్లో 2 శస్త్రచికిత్సలు చేయించుకోవలసి వచ్చింది. గాయం తర్వాత మరుసటి సంవత్సరం వెస్టిండీస్ తరఫున అతను అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
నికోలస్ పూరన్ గాయం సమయం నుంచి కొలుకొనే సమయంలో అతని గర్ల్ ఫ్రండ్ అతనికి తోడుగా నిలబడింది. నికోలస్ పూరన్ 2020 సంవత్సరంలో ఎలిస్సా మిగుల్ ను వివాహం చేసుకున్నాడు.
నికోలస్ పూరన్ గాయం ఇప్పుడు మరోసారి వార్తల్లో ఉండటానికి కారణం ఏంటంటే తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో రిషబ్ పంత్ సెంచరీ తో వార్తల్లోకి ఎక్కడమే. మాజీ ఆటగాళ్ళు సైతం రిషబ్ ను మిరాకిల్ మ్యాన్ అంటున్నారు.
డిసెంబర్ 2022లో జరిగిన కారు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. నికోలస్ పూరన్, రిషబ్ పంత్ వాస్తవానికి ఒకే దశ నుంచి బయటపడ్డారు. అయితే క్రికెట్ ఆడాలనే వారి మొండి పట్టుదల వారిని తిరిగి మైదానంలోకి తీసుకువచ్చింది.