Commentators Salary: ఒక్క మ్యాచుకు అంత తీసుకుంటారా? కామెంటేటర్ల జీతం తెలిస్తే మతి పోవాల్సిందే!
అభిమానుల భావోద్వేగాలను తెలుసుకోవాలన్నా... మ్యాచ్‌లను విశ్లేషించాలన్నా.. గత రికార్డులను చెప్పేయాలన్నా.. కామెంటేటర్లు కావాల్సిందే. మ్యాచ్ వ్యూహాలను పసిగట్టడంలోనూ... పిచ్‌ను అంచనా వేయడంలోనూ వీళ్లు సిద్ధహస్తులు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకామెంటేటేర్లు ప్రతీ మ్యాచ్‌కు టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పోటీగా సంపాదిస్తారు. ఒక మ్యాచ్‌కు రోహిత్, విరాట్ ఎంత తీసుకుంటారో.. వ్యాఖ్యతలు కూడా అంతే తీసుకుంటారు.
అంతర్జాతీయ మ్యాచులు, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్లో ఆడి క్రికెటర్లు డబ్బులు సంపాదించినట్లే... కామెంటేటర్లు కూడా బాగానే సంపాదిస్తారు. అయితే వ్యాఖ్యతల జీతాలను చాలా అరుదుగా మాత్రమే వెల్లడిస్తారు.
తాజాగా ఆకాష్ చోప్రా ఒక మ్యాచ్‌కు కామెంట్రీ చెప్తే వ్యాఖ్యాతలకు ఎంత డబ్బు లభిస్తుందో వెల్లడించాడు. ఒక మ్యాచ్‌కు వ్యాఖ్యాతలు సుమారు రూ. 10 లక్షలు వసూలు చేస్తారని అతను పోడ్‌కాస్ట్‌లో చెప్పాడు.
క్రికెట్ వ్యాఖ్యతలకు వేతనంతోపాటు ఇతరాల నుంచి కూడా భారీగా సంపాదన వస్తుందని ఆకాశ్‌చోప్రా వెల్లడించాడు. కామెంటేటర్లు ఇతర మార్గాల్లో కూడా డబ్బు సంపాదిస్తారని తెలిపాడు. రవిశాస్త్రి, ఆకాశ్ చోప్రా, ఇర్ఫాన్ పఠాన్‌లతో సహా పలువురు మాజీ క్రికెటర్లు కామెంట్రీలో ఉన్నారు.
రవిశాస్త్రి, ఆకాశ్ చోప్రా, సునీల్ గవాస్కర్, దినేశ్ కార్తీక్ ఇలా చాలామంది మాజీ క్రికెటర్లు... కామెంటేటర్లగానూ తమదైన ముద్ర వేస్తున్నారు.