IPL: IPLలో టాప్ ఇండియన్ ప్లేయర్ల తొలి జీతాలు ఎంతో తెలుసా?
ప్రస్తుతం IPLలో కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా, హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ టాప్ ఆటగాళ్లగా కొనసాగుతోన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App3. మరి, వీరంతా IPLలో అరంగేట్రం చేసినప్పుడు ఎంత జీతం అందుకున్నారు? ప్రస్తుతం ఎంత అందుకుంటున్నారు? ఇప్పుడు చూద్దాం.
VIRAT KOHLI: IPL-2008 ప్రారంభ సీజన్లో విరాట్ కోహ్లీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. అప్పుడు కేవలం రూ.12లక్షలకే కోహ్లీని RCB సొంతం చేసుకుంది. అలాంటిది ఇప్పుడు అంటే IPL-2021సీజన్‌కి గానూ కోహ్లీకి RCB రూ.17కోట్లు చెల్లిస్తోంది.
ROHIT SHARMA: IPL తొలి సీజన్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు దక్కన్ ఛార్జర్స్ రూ.3కోట్లు ఇచ్చింది. ఆ తర్వాత వేలంలో ముంబయి ఇండియన్స్ రోహిత్‌ను తీసుకుంది. ప్రస్తుతం రూ.15కోట్లు అందుకుంటున్నాడు.
KL RAHUL:IPL-2013 సీజన్లో అడుగుపెట్టిన కేఎల్ రాహుల్‌ను RCB రూ.10లక్షలతో సొంతం చేసుకుంది. ప్రస్తుతం రాహుల్ రూ.11కోట్లు అందుకుంటున్నాడు.
HARDIK PANDYA: IPL-2015వ సీజన్లో హార్దిక్ పాండ్య అడుగుపెట్టాడు. వేలంలో అతడ్ని ముంబయి ఇండియన్స్ రూ.10లక్షలకే కైవసం తీసుకుంది. ప్రస్తుతం పాండ్య రూ.11కోట్లు తన ఖాతాలో వేసుకుంటున్నాడు.
JASPRIT BUMRAH: IPL-2013 సీజన్ కోసం బుమ్రా తొలిసారి వేలంలోకి వచ్చాడు. అప్పుడు ముంబయి ఇండియన్స్ అతడికి రూ.10లక్షలు ఇచ్చి తీసుకుంది. ప్రస్తుతం బుమ్రా రూ.7కోట్లు తీసుకున్నాడు.