TTD News:అమ్మవారి నవ్వు, చూపు, సిగ్గు, మాటకు ప్రతీక అయిన ముత్యాలపందిరిపై ఆదిలక్ష్మి అలంకారంలో అలమేలుమంగ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన శనివారం ఉదయం ముత్యపుపందిరి వాహనంపై శ్రీ ఆదిలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులను అనుగ్రహించింది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనవంబరు 30 ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహనసేవలో భక్తులు భారీగా పాల్గొని అమ్మను దర్శించుకున్నారు
ముత్యాలంటే అలిమేలుమంగకు ప్రీతిపాత్రమైనవి...స్వాతికార్తెలో ముత్యపుచిప్పల్లో చినుకు పడి మేలుముత్యంగా రూపొందుతాయంటారు. అలాంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు, చూపులకు, మాటలకు, సిగ్గులకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీర్తనల్లో వర్ణించారు
తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలమేలుమంగను సేవించిన భక్తుల కన్నులకు అంతకుమించిన పండుగ ఏముంటుంది
కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 12 నుంచి రెండున్నర వరకూ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ఐదున్నర నుంచి ఆరు వరకూ అలిమేలుమంగకు ఉంజల్ సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 నుంచి 9 వరకూ అమ్మవారు సింహవాహనంపై భక్తులను కటాక్షించనుంది