Satyabhama Serial Today November 30th Highlights : మహదేవయ్య దుస్తులు కాల్చేసిన క్రిష్ .. కౌంట్ డౌన్ స్టార్ట్ చేసిన సత్య - సత్యభామ నవంబరు 30 ఎపిసోడ్ హైలెట్స్!
ఏంతో కొంత డబ్బులిచ్చి గంగను వదిలించుకోమంటుంది భైరవి. మహదేవయ్య మాత్రం తనకు ఎలాంటి సంబంధం లేదంటాడు. DNA టెస్ట్ ఫైనల్ అని తేల్చి చెప్పేస్తుంది గంగ. బయటకు ధైర్యంగా ఉన్నా భైరవి మనసులో అనుమానం అలానే ఉండిపోతుంది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమరోవైపు సంజయ్ విధి మనల్ని కలుపుతోంది అన్న మాటలు గుర్తుచేసుకుంటుంది సంధ్య. అసలు ఈ రోజు బయటకు పోను అనుకుంటుంది. ఇంతలో తండ్రి వచ్చి మందులు తీసుకురమ్మని హర్షకి చెబుతాడు. సంధ్యని వెళ్లమంటాడు హర్ష..ఈరోజు అసలు బయటకు వెళ్లను అంటాడు
బయటకు ఎందుకు వెళ్లకూడదు అనుకుంటున్నావో అంటుంది నందిని. నా ఇష్టం అంటాడు హర్ష.. మైత్రిని కలవడం లేదని నన్ను నమ్మించేందుకేనా అన్న నందిని నీపై నమ్మకం ఉందిలే అంటుంది..నిజంగానా అని సంతోషిస్తాడు హర్ష..
DNA టెస్ట్ కోసం శాంపిల్స్ తీసుకెళ్లేందుకు వస్తారు. ఇంట్లో అందరూ వస్తారు. మా మావయ్యకి చాలా నష్టం చేశావ్..మా మావయ్య మంచితనం వల్ల ఆయన ముందు నిల్చున్నావ్..ఇక ఈ నాటకానికి తెరదించు అంటుంది సత్య.. కన్నప్రేమని నాటకం అనొద్దమ్మా కోడలా అని యాక్ట్ చేస్తుంది గంగ.
ఇప్పటివరకూ చేసిన మోసం చాలు నిజం ఒప్పుకో అబద్ధం ముసుగు తీసేయె..ఇదే నీకు ఇచ్చిన చివరి అవకాశం అని ఇన్ డైరెక్ట్ గా మహదేవయ్యకి వార్నింగ్ ఇస్తుంది సత్య. క్రిష్ నీకు పుట్టలేదని ఒప్పుకుని ఇక్కడి నుంచి వెళ్లిపో గంగా అంటుంది సత్య. సెడన్ గా ఎందుకిలా మాట్లాడుతోంది అనుకుంటాడు మహదేవయ్య.
మోసం చేస్తోన్నది నేనుకాదు మీ మావయ్యే అంటుంది గంగ. ఆ తర్వాత శాంపిల్స్ ఇస్తుంది. బంటి శాంపిల్స్ ఇస్తారు. నాన్నా నువ్వు DNA టెస్టుకి వస్తావా నేనే నీ కన్నతల్లి అని ఒప్పుకుంటావా అన్న గంగకు..ఓ నమస్కారం పెట్టి శాంపిల్స్ ఇస్తాడు క్రిష్..
image 8
మీరు శాంపిల్ ఇవ్వాలో వద్దో డిసైడ్ చేసుకోండి..మీరు తన కన్నతండ్రి కాదని క్రిష్ కి చెప్పేస్తే బయటపడతారని మరోసారి వార్నింగ్ ఇస్తుంది. కాదు కూడదని శాంపిల్ ఇస్తే మీకు రాజకీయ సమాధి తప్పదని హెచ్చరిస్తుంది
మీరు వెనక్కు తగ్గుతున్నారా..శాంపిల్ ఇవ్వడం లేదు ఎందుకు అని క్వశ్చన్ చేస్తుంది సత్య. అస్సలు తగ్గేదే లేదు , గంగతో సంబంధం లేదన్నాడు కదా లేనిపోని పంచాయితీలు ఎందుకు శాంపిల్స్ ఇవ్వు అంటుంది భైరవి. తప్పని పరిస్థితుల్లో శాంపిల్స్ ఇస్తాడు మహదేవయ్య.
సత్యభామ డిసెంబరు 02 ఎపిసోడ్ లో మహదేవయ్య దుస్తులు వేసుకుని తన చైర్ పై కూర్చున్న బంటిపై ఫైర్ అవుతాడు క్రిష్. బంటి వేసుకున్న ఆ దుస్తులు తీసి కాల్చేస్తాడు. మోసం చేసింది గంగ కాదు మీరే అని తెలిస్తే మీ పరిస్థేంటో ఊహించుకోండి ..మీ దౌర్జన్యానికి ఆఖరి గంటలు మోగబోతున్నాయ్ అంటుంది సత్య.