Brahmamudi Serial Today November 30th Highlights : దుగ్గిరాలవారింటికి విడాకుల నోటీస్.. ఈగో రాజ్ తగ్గాల్సిందేనా - బ్రహ్మముడి నవంబరు 30 ఎపిసోడ్ హైలెట్స్!
ఇంటికి భోజనం తెచ్చిన కావ్యకు డబ్బులిచ్చి అవమానిస్తాడు రాజ్. మీకిది అలవాటే అని రివర్సవుతుంది కావ్య. అయినా నాకు సంబంధం లేని నువ్వు ఏ వైపునుంచి బంధం కలుపుకున్నారని అడిగితే..మా వైపు నుంచి అంటుంది ఇందిరాదేవి. మా ఇంట్లో పుట్టిన అడ్డగాడిదకు బుద్ధి లేకపోయినా మనవరాలిగా మా బాధ్యతలు చూసుకుంటోంది అంటుంది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇక కళావతి ఈ ఇంటికి రావాల్సిన అవసరం లేదంటూ స్టెల్లా అనే స్టార్ హోటల్లో పనిచేసే చెఫ్ ని మాట్లాడాను..నెలకు లక్ష రూపాయలు జీతం అంటాడు. వీడి మాటలు పట్టించుకోకుండా నువ్వెళ్లి రేపు క్యారేజ్ తీసుకురామ్మా అంటారు.. సరే అని వెళ్లిపోతుంది కావ్య...
అప్పు కళ్యాణ్ ఇద్దరూ భోజనం చేస్తుంటారు. కళ్యాణ్ అప్పుని అలానే చూస్తుంటాడు..ఎందుకలా అని అడిగితే ఈ రోజు ఇలానే చూడాలని అనిపిస్తోంది అంటాడు కళ్యాణ్. నన్ను నమ్మి నాతో వచ్చినందుకు, ఎన్ని అడ్డంకులు ఎదురైనా నాతోనే ఉన్నందుకు అని అంటాడు. అదే కదా ప్రేమంటే అంటుంది అప్పు.
అనామికతో నువ్వు మాట్లాడిన మాటలు వింటే నువ్వు నన్ను నాకన్నా ఎక్కువ నమ్మావు అనిపించింది. నువ్వు నన్ను అంతలా ఎలా నమ్మావ్ అంటే..మనల్ని మనం నమ్మితేనే కదా అనుకున్నది సాధించగలం అంటుంది. ఎవరు ఎక్కువ కష్టపడితే వాళ్లదే సక్సెస్ అంటుంది.
కావ్యను ఎన్ని రకాలుగా తరిమేసినా ఎలాగైనా తిరిగొస్తోందని రుద్రాణి టెన్షన్ పడుతుంటుంది. రాజ్ వంటమనిషిని చూశాడుకదా అని రాహుల్ అంటే పనిమనిషిగా వస్తుందేమో అంటుంది..కరెక్ట్ చెప్పారు అత్తయ్యా అంటూ ఎంట్రీ ఇస్తుంది స్వప్న. నా చెల్లులు వస్తుంది ఆస్తి పంపకాలు ఆపుతుంది అంటుంది.
సీతారామయ్య, ఇందిరాదేవి భోజనం చేస్తుంట్ రాజ్ సోఫాలో కూర్చుని ఆకలితో బాధపడుతుంటాడు. నువ్వు వచ్చి తినరా అంటే నేను ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా అంటాడు.
ఫుడ్ వచ్చిన తర్వాత చూస్తే అది పూర్తిగా చల్లగా అయిపోయింది తినలేం అనకుంటాడు. ఇంట్లో ఎవరూ చూడడం లేదని కన్ఫామ్ చేసుకుని కిందకు వెళ్లి కావ్య ఉంచిన భోజనం తింటుంటాడు..అప్పుడే ఇందిరాదేవి వచ్చి వాటర్ ఇస్తుంది. కావ్య గురించి చెప్పేందుకు చూసినా రాజ్ పట్టించుకోడు
మర్నాడు కావ్య రాగానే ఇందిరాదేవితో మాట్లాడుతుంటే రాజ్ దొంగచాటుగా వింటుంటాడు. దొంగచాటుగా చూస్తున్నావెందుకు రాత్రి చేసిన దొంగతనం గుర్తొచ్చిందా అని సెటైర్ వేస్తుంది. ..
ఇంకా కొత్త కుక్ రాలేదేంటని రాహుల్ అంటే వస్తుందని చెబుతాడు..ప్రకాశం కూడా కొత్త కుక్ కోసం వెయిటింగ్ అంటాడు ( తన భార్యకు బుద్ధి చెప్పేందుకు ఇదే మంచి టైమ్ అనుకుంటాడు). మీకెందుకు స్పెషల్ ఇంట్రెస్ట్ అంటుంది ధాన్యలక్ష్మి...
బ్రహ్మముడి డిసెంబరు 02 ఎపిసోడ్ లో... మమ్మీ నీకు విడాకులు ఇస్తున్నట్టు నోటీసులు పంపించింది డాడీ అంటాడు రాజ్. మీ ఇంట్లో అంతా కలసి ఏం నూరిపోశారని కావ్యపై ఫైర్ అవుతాడు . జీవితాంతం తోడుండాల్సిన భార్యని దూరం చేసుకోవాలి అనుకోవడం నాకు లేదంటాడు సుభాష్. రేపటికన్నా అమ్మను ఇంటికి తీసుకొస్తానంటాడు రాజ్.. ఏం జరుగుతుందో చూడాలి...