Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం
తిరుమల, తిరుపతి ఆలయాల్లో ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయం, తిరుపతి శ్రీగోవింద రాజస్వామి ఆలయం, శ్రీకోదండరామాలయాల్లో ఈ కార్యక్రమంగా వైభవంగా నిర్వహించింది టీటీడీ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆణివార ఆస్థానం అని పేరు. తిరుమల తిరుపతి పాలక మండలి ఏర్పాటు అవక ముందు ఈ ఆణివార ఆస్థానం నిర్వహించిన రోజు నుంచి టీటీడీ వార్షిక బడ్జెట్ ఆరంభం అయ్యేది. ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాలు, డిపాజిట్లు, వార్షిక లెక్కలు మొదలయ్యేవి. పాలక మండలి ఏర్పాటయ్యాక వార్షిక బడ్జెట్ను మార్చి- ఏప్రిల్కు మార్చారు.
ఆణివార ఆస్థానం సందర్భంగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని వేంచేసి సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7 గంటల వరకు ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీరంగం ఆలయం నుంచి నూతన వస్త్రాలను విమాన ప్రదక్షిణగా తీసుకువచ్చి శ్రీ గోవిందరాజస్వామివారికి సమర్పించారు
శ్రీ కోదండరామాలయంలో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు గరుడాళ్వార్ ఎదురుగా శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరాములవారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ప్రత్యేకంగా ఆస్థానం నిర్వహించనున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం