Ganesh Chaturthi 2025: గణేష్ చతుర్థి సందర్భంగా మండపాలు, ఇంట్లో అలంకారం ఇలా ఈజీగా చేసేసుకోండి..శాంపిల్ ఫొటోస్ ఇవిగో!
వినాయక చవితి ఉత్సవాల సందడి ప్రారంభమైంది. భాద్రపద మాసం శుక్ల పక్ష చవితి రోజు గణేష్ చతుర్థి జరుపుకుంటారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ రోజున పార్వతీ దేవి నలుగుపిండి నుంచి బొమ్మను తయారు చేసి ప్రాణం పోసింది. ఆ బొమ్మకు పెట్టిన పేరే గణపతి
గణేష్ ఉత్సవం సందర్భంగా మీ ఇంట్లో ఈశాన్య మూలను గణపతి కోసం కేటాయించండి. గణపతి రాకతో ఆ ప్రదేశంలో ప్రత్యేకమైన ఆసనం వేయండి. వివిధ రంగుల లైట్లను ఉపయోగించి దేవుని ఇంటిని అలంకరించండి.
గణపతిని ఉంచాలనుకున్న ప్రదేశంలో ప్రత్యేక ఆసనం వేసి...రంగు రంగు లైట్లు, పూలతో అలంకరించండి
వినాయకుడి పూజకోసం పసుపు రంగుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. పసుపు రంగు సుఖసమృద్ధికి చిహ్నం. ఇది ఇంట్లో ఆనందాన్ని తెస్తుంది. పసుపు రంగు దుస్తులను వాడండి. పసుపు రంగు పువ్వులను ఉపయోగించండి.
సులభమైన , సాధారణ డిజైన్లతో మీరు మీ ఇంటిని అందంగా మరియు ఆకర్షణీయంగా తీర్చిదిద్దవచ్చు. గణేశుడి ఆసనం ముందు మీరు అందమైన రంగోలిని వేయండి