ఆ వ్యక్తుల కాళ్ళను పొరపాటున కూడా తాకవద్దు, పుణ్యం బదులు పాపం వస్తుంది!
హిందూ ధర్మంలో పెద్దల పట్ల గౌరవం చూపించడంలో భాగంగా కాళ్ళకు నమస్కరిస్తారు. కాళ్ళకు నమస్కరించే ప్రక్రియ ఎంతగానో నమ్మకం విశ్వాసంతో ముడిపడి ఉంది..కానీ కొన్ని నియమాలు పాటించాలని చెబుతారు పండితులు. హిందూ ధర్మం ప్రకారం ఏడుగురి వ్యక్తుల పాదాలు ఎప్పుడూ తాకకూడదు, దారిద్ర్యం పెరుగుతుందట
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమేనల్లుడు లేదా మేనకోడలు తమ మేన మామ- మేనత్తల పాదాలు తాకకూడదని కొన్ని ప్రాంతాల్లో విశ్వశిస్తారు. ఇలా చేస్తే అదృష్టం దురదృష్టంగా మారిపోతుందట
కన్యను దేవత స్వరూపంగా భావిస్తారు. అవివాహిత బాలికల పాదాలను ఎప్పుడూ తాకకూడదు. ఇది వ్యక్తికి దోషం కలిగిస్తుంది. ఇలా చేయడం వల్ల ఇంటిపై ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది.
ఒక వ్యక్తి నిద్రపోతున్నప్పుడు అతని కాళ్ళు తాకకూడదు. ఇది అశుభంగా పరిగణిస్తారు. నిద్రలో ఉన్న వ్యక్తి కాళ్లు తాగితే వారి ఆయుష్షు తగ్గిపోతుందటట. కేవలం మరణించిన వ్యక్తి కాళ్లు మాత్రమే పడుకుని ఉండగా తాకుతారు
ఆలయంలో ఎవరైనా పరిచయస్తులు కనిపిస్తే, అక్కడ వారి కాళ్లు తాకకూడదు, ఆలయం దేవుని స్థలం, ఇక్కడ దేవుళ్ళ కంటే ఎవ్వరూ గొప్పవారు కాదు.
అసౌచంలో ఉన్న, మలవిసర్జన చేసిన, శ్మశాన వాటిక నుంచి వచ్చిన వారి పాదాలకు ఎప్పుడూ నమస్కరించకూడదు..ఇది ప్రతికూల ప్రభావం చూపిస్తుంది