Moong Dal for Better Health : రోజూ పెసలు తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా? అలసట, రక్తహీనతతో పాటు ఎన్నో దూరం
విటమిన్ B12.. DNA తయారీలో, కణాలకు శక్తిని అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల అలసట, బలహీనత, రక్తహీనత, నాడీ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి.
విటమిన్ B12 లోపం చాలామందిలో ఉంటుంది. దీనిని భర్తీ చేయడానికి సప్లిమెంట్లను ఆశ్రయిస్తారు. కానీ మీ వంటగదిలోని ఓ ఫుడ్ ఈ విటమిన్ లోపాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అదే పెసరపప్పు.
పెసర పప్పు రుచిలోనే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో ప్రోటీన్, ఫైబర్, మినరల్స్‌తో నిండి ఉంటుంది. దీనిలో విటమిన్ బి12 కూడా పుష్కలంగా ఉంటుంది. అందుకే దీనిని 'శాకాహారులకు పవర్ ఫుడ్' అని పిలుస్తారు.
ప్రతిరోజూ సరైన పద్ధతిలో పెసరపప్పు తీసుకుంటే.. విటమిన్ B12 లోపం తగ్గుతుంది. అంతేకాకుండా శరీరంలో రక్తహీనత తగ్గి, రోగనిరోధక శక్తి పెరిగి బలహీనత కూడా దూరమవుతుంది.
దీనిని తీసుకోవడానికి బెస్ట్ మార్గం ఏమిటంటే.. రాత్రి పడుకునే ముందు ఒక కప్పు పెసర పప్పును బాగా కడిగి.. నీటిలో నానబెట్టండి. ఉదయం దాని నీరు తాగండి. నానబెట్టిన పప్పులో ఉల్లిపాయ, నిమ్మకాయ, టమోటా వేసి సలాడ్ లాగా తీసుకోవచ్చు. ఈ పద్ధతి మీ శరీరాన్ని డీటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. విటమిన్లు, ఖనిజాలను శరీరానికి అందిస్తుంది.
అంతేకాకుండా పెసర పప్పును కిచిడి, సూప్ లేదా స్ప్రౌట్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇది తేలికగా జీర్ణం కావడానికి హెల్ప్ చేస్తుంది.
సప్లిమెంట్స్ లేకుండా.. కేవలం సహజ పద్ధతిలో విటమిన్ B12 లోపాన్ని భర్తీ చేయాలనుకుంటే.. పెసర పప్పును రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. కొన్ని వారాల్లోనే తేడాను మీరే గమనిస్తారు.